పెగాసస్ హ్యాకింగ్ : ఇజ్రాయెల్ NSOపై వాట్సాప్ చట్టపరమైన చర్యలు

by Shyam |
పెగాసస్ హ్యాకింగ్ : ఇజ్రాయెల్ NSOపై వాట్సాప్ చట్టపరమైన చర్యలు
X

దిశ, ఫీచర్స్ : యూజర్ల డేటాను, వివరాలను ఫేస్‌బుక్, వాట్సాప్‌లు దొంగలిస్తున్నాయని గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫేస్‌బుక్, వాట్సాప్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ తన సంస్థలకు వ్యతిరేకంగా అనేక అసమానతలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు ఓ శుభవార్త అందింది. ఇజ్రాయిల్ స్పైవేర్ సంస్థ ఎన్ఎస్ఓ పెగాససన్‌ను వినియోగించుకొని అనేక మంది డేటాను కాజేసింది.

తన చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఎన్ఎస్ఓ సంస్థ వాట్సాప్‌ను వినియోగించుకుందని, వాట్సాప్ ద్వారా భారత్‌ సహా పలు దేశాల్లోని జర్నలిస్టులు, రాజకీయ ప్రముఖుల రహస్యాలు తెలుసుకునేందుకు ఇజ్రాయెల్ ఎన్ఎస్ఓ ప్రయత్నించిందని, కాబట్టి ఎన్ఎస్ఓపై చట్టపరమైన చర్య తీసుకోవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. సార్వభౌమ నిరోధక చట్టాల క్రింద రక్షించబడాలని NSO చేసిన అభ్యర్థనలను తిరస్కరించిన యునైటెడ్ స్టేట్స్‌లోని అప్పీల్ కోర్టు.. వాట్సాప్‌లో చేపట్టిన స్నూపింగ్‌పై వ్యాజ్యాలను ఎదుర్కోకుండా చేసింది. భారతదేశంలోని అనేక ప్రభుత్వాలు స్నూపింగ్ వాదనలను తిరస్కరించినప్పటికీ స్పైవేర్ కంపెనీ తన ఉత్పత్తుల శ్రేణిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అధికార ప్రభుత్వాలకు మాత్రమే అందజేస్తుందని పేర్కొంది.

1,400 మంది వాట్సాప్ ఖాతాల హ్యాక్..
పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించి ఇజ్రాయెల్ ఎన్‌ఎస్ఓ 1400 మంది వినియోగదారుల ఖాతాలను హ్యాక్ చేసిందని 2019లో WhatsApp పేర్కొంది. తద్వారా కంపెనీ రహస్య క్లయింట్లు, వారి వినియోగ ప్రయోజనం గురించి తెలుసుకున్నారని చెప్పింది. పెగాసస్ అనేది ఒక అధునాతన స్పైవేర్ కాగా, స్టార్ట్ ఫోన్ డివైజెస్‌లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌ను యూజ్ చేస్తున్నారనే దానితో సంబంధం లేకుండా జీరో క్లిక్‌తో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు.

Advertisement

Next Story