- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాట్సాప్ పే ఇండియా హెడ్‌గా మనేష్ మహాత్మే నియామకం!
దిశ, వెబ్‌డెస్క్: ఫేస్‌బుక్ యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సప్ తాజాగా అమెజాన్ మాజీ ఎగ్జిక్యూటివ్ మనేష్ మహాత్మెను భారత్‌లోని తన చెల్లింపుల వ్యాపార విభాగానికి హెడ్‌గా నియమించింది. సిటీ బ్యాంక్, ఎయిర్‌టెల్ మనీ, అమెజాన్ పే వంటి వివిధ డిజిటల్ ఆర్థిక సేవలు, చెల్లింపుల్లో 17 ఏళ్ల అనుభవం మనేష్ మహాత్మెకు ఉందని వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపింది. అమెజాన్ పే ఇండియా డైరెక్టర్, బోర్డు సభ్యుడిగా ఏడేళ్ల పాటు చేసిన మనేష్ ఉత్పత్తి, ఇంజనీరింగ్ విభాగాలకు నాయకత్వం వహించారు.
‘వాట్సాప్ పే చెల్లింపుల ద్వారా భారత్‌లో వినియోగదారులకు డిజిటల్ చెల్లింపుల సేవలను అందుబాటులో తీసుకురావడం, తద్వారా దేశ వృద్ధికి కీలక భాగస్వామ్యాన్ని కల్పించాలని భావిస్తున్నట్టు’ మనేష్ మహాత్మె చెప్పారు. గత దశాబ్దం కాలంగా భారత డిజిటల్ చెల్లింపుల పెరుగుదలలో మనేష్ కీలకంగా ఉన్నారు. ఆయన అనుభవం వాట్సాప్ పేకు ఎంతో దోహదపడుతుందని వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ వెల్లడించారు.