- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీలో దయా గుణం ఉందా.. డబుల్ ఆనందం మీ సొంతం..
దిశ, ఫీచర్స్ : ‘ఇతరులతో దయగా ఉంటే.. అది మిమ్మల్ని మార్చడమే కాదు ప్రపంచాన్ని మారుస్తుంది’ అనే మాటల్లోని వాస్తవం, గొప్పతనం మహమ్మారి రోజుల్లో అందరికీ తెలిసొచ్చింది. లాక్‌డౌన్ ఆపత్కాలంలో ప్రజలంతా ఒకరికొకరుగా అండగా నిలిచి పరస్పరం సహాయ సహకారాలు అందించుకున్నారు. ఎంతోమంది ప్రాణాలు లెక్కచేయకుండా తమ దయాగుణాన్ని ప్రదర్శించారు. అయితే పాండమిక్ తర్వాత కూడా ప్రజలు ‘కైండ్‌నెస్’ గురించి ఎక్కువగా ఆలోచిస్తుండటం సానుకూలాంశం. ఈ నేపథ్యంలోనే డెవలప్‌మెంటల్ సైకాలజిస్ట్ రాబిన్ బెనర్జీ.. బీబీసీ భాగస్వామ్యంలో యూకేలోని సస్సెక్స్ విశ్వవిద్యాలయ బృందంతో కలిసి ‘కైండ్‌నెస్ టెస్ట్’ అనే భారీ ఆన్‌లైన్ పబ్లిక్ సైన్స్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడు. ప్రపంచవ్యాప్తంగా పౌరులు దీనిపై తమ అభిప్రాయాన్ని పంచుకునే వీలుండగా.. ఈ పరిశోధన నేటి ప్రపంచంలో ‘దయ’కు సంబంధించిన పూర్తి అవగాహన అందిస్తుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు. కాగా ఇప్పటివరకు వచ్చిన అధ్యయనాల ప్రకారం అసలు ‘దయ’ అంటే ఏమిటి? దాని గురించి ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు?
‘కైండ్‌నెస్’ ‘పే ఇట్ ఫార్వార్డ్’ ‘బీ కైండ్’ అనే పదాలను తరచుగా సోషల్ మీడియాలో చూస్తుంటాం. జనాదరణ పొందిన హ్యాష్‌ట్యాగ్స్‌లో ఇవి టాప్‌లో ఉంటాయి. అవసరమైన సమయాల్లో ఎవరికైనా మద్దతు ఇవ్వడం, ‘నేను మీ కోసం ఉన్నాను’ అనే భావన కల్పించడాన్నే ‘దయ’గా అభివర్ణిస్తున్నాం. దయతో చిన్న పనిచేసినా, ఇతరులపై దాని ప్రభావం ఇతరులపై లోతుగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. దయతో చేసే పనులు అలల వలె మెరుగైన ప్రపంచం కోసం అనంతంగా ప్రసరిస్తాయి. తద్వారా పొందిన మానసిక భావోద్వేగాన్ని మాటల్లో చెప్పలేం. అది మన ఆరోగ్యాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ తరహా స్వభావం మనల్ని ఇతరులతో మెరుగైన మార్గంలో కనెక్ట్ అవ్వడానికి.. కుటుంబం, సమాజం, పాఠశాల, పని ప్రదేశాల్లో మన సంబంధాలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. వృద్ధాప్యాన్ని కూడా నెమ్మదిస్తుంది. హాస్యకారుడు చార్లీ చాప్లిన్ చెప్పినట్లు ‘తెలివి కంటే మనకు దయ, సౌమ్యత చాలా అవసరం. ఈ లక్షణాలు లేకుంటే జీవితం హింసాత్మకంగా ఉండటమే కాదు, అన్నీ కోల్పోతాం కూడా’.
ఆనందం డబుల్ :
ఒకానొక ఉదయం వాంకోవర్(కెనడా)లోని ఓ వీధిలో నడుస్తున్న ప్రజలను తాను నిర్వహిస్తున్న ఒక ప్రయోగంలో పాల్గొనమని అమెరికన్ సైకాలజిస్ట్ ఎలిజబెత్ డన్ కోరాడు. ప్రయోగంలో భాగంగా వారికి $ 5/$ 20 నోటు ఉన్న కవరు ఇచ్చాడు. సగం మందిని ఆ డబ్బును తమ కోసం ఖర్చు చేయాలని కోరిన ఎలిజబెత్.. మిగిలినవాళ్లకు ఇతరులకు బహుమతిగా లేదా స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వాలని సూచించాడు. ఆ పని పూర్తయిన తర్వాత మళ్లీ వారందరితో పరిశోధకుడు మాట్లాడాడు. మొదటి గ్రూప్ ‘సుషీ, చెవిపోగులు, కాఫీ’ వంటి వస్తువులను కొనుగోలు చేసినట్లు చెప్పగా, రెండవ గ్రూప్‌లోని వ్యక్తులు తమ బంధువుల కోసం బొమ్మలు, ఆహార పదార్థాలు, బహుమతులు లేదా వీధిలో ఉన్న నిరాశ్రయులకు డబ్బు అందించండం వంటి పనులకు వెచ్చించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే వారి మానసిక స్థితిని రేట్ చేసిన పరిశోధకులు.. డబ్బును వేరొకరికి అందించినవారే అధిక సంతోషంగా ఉన్నట్లు గ్రహించారు. ఇదేగాక దయతో ప్రవర్తించడం మన శ్రేయస్సుపై చిన్న నుంచి మధ్యస్థ ప్రభావాన్ని చూపుతుందని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని మెటా-విశ్లేషణలో ఆలివర్ స్కాట్ కర్రీ కనుగొన్నారు. న్యూరో సైంటిఫిక్ పరిశోధనల ప్రకారం.. మనం ఎవరికైనా మంచి చేసేటప్పుడు మన మెదడులోని రివార్డ్ సిస్టమ్‌లో ఓ మెరుపు కనిపిస్తుందని తెలిపారు.
దయ.. ఓ అంటువ్యాధి
దయగల చర్యలు అలల ప్రభావాన్ని కలిగి ఉంటాయి. వేరొకరు దయతో ప్రవర్తించారని విన్నప్పుడు మనం కూడా అలాంటి మంచి పనులు చేసేలా మెదడు మనల్ని ప్రేరేపిస్తుంది. అంతేకాదు దయ పొందినవాళ్లు, ఇతరులతోనూ దయగా ఉంటారని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఉదాహరణకు చీమ-పావురం కథ. నీళ్లలో పడిపోయిన చీమకు, ఆకు వేసి రక్షిస్తుంది పావురం. అలానే ఓసారి పావురాన్ని చంపేందుకు వేటగాడు బాణం గురిపెట్టినప్పుడు చీమ అతడిని కుట్టి దాన్ని కాపాడుతుంది.
ఆందోళన తగ్గుతుంది!
ఆందోళన అనుభవిస్తున్న విద్యార్థులను నాలుగు వారాలపాటు దయతో కూడిన చర్యలను చేయమని కోరినప్పుడు.. వాళ్లు తమ రూమ్‌మేట్స్‌కు పనుల్లో హెల్ప్ చేయడం, ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం, విరాళాలు సేకరించడం వంటివి చేశారు. ఈ మేరకు ఆందోళన తగ్గడంతో పాటు సానుకూల అంచనాలను కలిగి ఉండేందుకు దయతో వ్యవహరించడం సాయపడిందని అధ్యయనం చేసిన సైమన్ ఫ్రేజర్ యూనివర్సిటీకి చెందిన జెన్నిఫర్ ట్రూ అభిప్రాయపడ్డాడు.
ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం?
ప్రయోగాలు, అధ్యయనాలు చిన్న సమూహాలకే పరిమితమవుతాయి. ‘దయ’గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మరింత బిగ్ పిక్చర్ అవసరం అవుతుంది. అందువల్లే చాలామంది ‘దయ’ అనేది సమాజంపై ఎలా ప్రభావం చూపుతుందనే దానిపై మరింత పరిశోధన అవసరమని వాదించారు.
అత్యంత సాధారణం :
అపరిచితుడు పడిపోగానే, వెంటనే హెల్ప్ చేస్తాం. అలానే దాతృత్వానికి డబ్బు ఇవ్వడం, ఒకరు బాధలో ఉంటే ఓదార్చడం వంటి అత్యంత సాధారణ పనులను కూడా మనం దయతో పోల్చుతాం.
ఏది నిరోధిస్తుంది?
మనలో చాలామంది వీలైనప్పుడు దయగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రతిసారీ ఇది సులభం కాదు. అయితే అందుకు గల అడ్డంకులు ఏమిటి? ఎవరికైనా ఏదైనా అవసరమైనప్పుడు మనం గమనించలేదా? బలహీనంగా ఉన్నామని వెనకడుగు వేస్తున్నామా? అర్థిక పరిస్థితి బాగా లేదని ఆలోచిస్తున్నామా? అపరిచితుల విషయంలో వారికి అవసరం లేకపోయినా మనమే సాయం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నామా? మాట్లాడటానికి చాలా సిగ్గుపడుతున్నామా? ఇలాంటివెన్నో మనల్ని దయగా ఉండకుండా నిరోధించే కారణాలు కావచ్చు. వాటిని దాటుకుంటూ ముందుకెళ్లినప్పుడే ఒకరికి హెల్ప్ చేయగలుగుతాం. వారిలో ధైర్యాన్ని పెంచి, మరికొందరి పట్ల దయతో వ్యవహరించేలా మార్పు తీసుకురాగలం.
కైండ్‌నెస్ టెస్ట్‌లో పార్టిసిపేట్ చేస్తారా?
దయను అన్వేషించడానికి ‘కైండ్‌నెస్ టెస్ట్’ రూపొందించగా.. చాలా మంది ప్రజలు దయగా వ్యవహరించడం, స్వీకరించడం ఎలా అనిపిస్తుందనే దాని గురించి తమకు అవగాహన ఉందని చెప్పవచ్చు. కానీ అది ఏమిటో, ఎక్కడ, ఎప్పుడు అనుభవిస్తారో, దాని ప్రభావం ఏమిటో బాగా అర్థం చేసుకునేందుకు ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది. వివిధ సమూహాల్లో ప్రజల దృక్పథాలు ఎలా మారవచ్చు? ఆరోగ్యం, శ్రేయస్సు, ఇతర సామాజిక, మానసిక అనుభవాలతో దయకు ఎలాంటి సంబంధం ఉంటుందో అన్వేషించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. వారి ప్రశ్నావళిని పూర్తి చేయడానికి 4 అక్టోబర్ 2021 ముందు thekindnesstest.orgను సందర్శించవచ్చు.
‘కైండ్‌నెస్ టెస్ట్’ దయపై మీ అభిప్రాయాలను అడుగుతుంది. సరైన లేదా తప్పు సమాధానాలు అంటూ ఉండవు. మీరు వాటిని ఫిల్ చేస్తే.. చివరలో దయకు సంబంధించిన స్నీక్ ప్రివ్యూ పొందుతారు.