- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక నేను వింబుల్డన్ ఆడకపోవచ్చు : రోజర్ ఫెదరర్
దిశ, స్పోర్ట్స్: దిగ్గజ టెన్నిస్ ప్లేయర్, 20 సార్లు గ్రాండ్‌స్లామ్స్ గెలిచిన రోజర్ ఫెదరర్ వింబుల్డన్ 2021నుంచి అనూహ్యంగా నిష్రమించాడు. క్వార్టర్ ఫైనల్‌లో 6-3, 7-6, 6-0 తేడాతో పోల్ హుబార్ట్ హర్కాజ్‌పై ఓడిపోయాడు. 2002 తర్వాత రోజర్ ఫెదరర్ వరుస సెట్లలో ఓడిపోవడం వింబుల్డన్‌లో ఇదే తొలిసారి. ‘గత ఏడాది గాయం తర్వాత మరో వింబుల్డన్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాను. నేను ఇంత వరకు రావడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. గత కొంత కాలంగా గాయం కారణంగా ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు.
అందుకే క్వార్టర్స్ వరకు రావడం నాకు ఆనందాన్ని కలిగించింది. ప్రస్తుతం నా ఫిట్‌నెస్ ఇతర కారణాలను చూసుకుంటే మరో వింబుల్డన్ ఆడతానో లేదో నాకే తెలియడం లేదు’ అని ఫెదరర్ అన్నాడు. వింబుల్డన్‌లో మొత్తం 119 మ్యాచ్‌లు ఆడిన ఫెదరర్‌కు ఇది 14వ పరాజయం. 6-0 తేడాతో గ్రాండ్‌స్లామ్‌లో సెట్ చేజార్చు కోవడం ఇది మూడో సారి మాత్రమే. 1999లో పాట్ రాఫ్టర్‌పై ఫ్రెంచ్ ఓపెన్‌లో 2008లో రఫెల్ నదాల్‌పై ఇలా సెట్లు కోల్పోయాడు. అవి రెండు కూడా ఫ్రెంచ్ ఓపెన్‌లోనే జరిగాయి. కానీ వింబుల్డన్‌లో తొలిసారి ఇంతటి దారుణమైన ప్రదర్శన చేశాడు.
- Tags
- roger federer