- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మే నెలలో.. గూగుల్‌లో ఏం సెర్చ్ చేశారంటే?
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ కారణంగా మే నెలలోనూ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఎక్కువగా దేని గురించి సెర్చ్ చేశారో గూగుల్ వెల్లడించింది. తాజాగా మే నెలకు సంబంధించిన సెర్చ్ ట్రెండ్స్‌ను విడుదల చేసింది.
గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ ప్రకారం ‘లాక్‌డౌన్ 4.0’ మోస్ట్ సెర్చ్ టాపిక్‌గా నిలిచింది. ఆ తర్వాతి ప్లేస్‌లో ‘ఈద్ ముబారక్’ ఉంది. ‘కరోనా వైరస్ లాక్‌డౌన్ జోన్స్ ఢిల్లీ’ గురించి నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేశారు. కరోనాకు మందు లేకపోవడంతో.. కరోనా వ్యాక్సిన్ గురించి కూడా నెటిజన్లు గూగుల్‌ను జల్లెడ పట్టారు. అందులో ముఖ్యంగా ‘ఇటలీ కరోనా వైరస్ వ్యాక్సిన్’ గురించిన సెర్చ్, క్రికెట్ రిలేటెడ్ సెర్చ్ కూడా టాప్ ట్రెండింగ్‌లో నిలిచాయి.
ఇండియా విషయానికొస్తే.. ‘విచ్ డిసీజ్ రిలేటెడ్ టూ కరోనా వైరస్?’ టాప్ ప్లేస్ దక్కించుకుంది. వ్యాక్సిన్ అంటే ఏమిటి ? అని నెటిజన్లు ఎక్కువగా శోధించగా.. అనుష్క శర్మ నిర్మాతగా వ్యవహరించిన పాతాళ్ లోక్ వెబ్ సిరీస్ కూడా ట్రెండింగ్‌లో నిలవడం గమనార్హం.