నేలపై కూర్చోని భోజనం చేస్తే లాభాలేంటంటే..?

by  |
నేలపై కూర్చోని భోజనం చేస్తే లాభాలేంటంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: నేలపై కూర్చొని భోజనం చేయడం వల్ల ఎన్నో రకాలుగా ఉపయోగాలున్నాయని పెద్దలు, వైద్యులు, నిపుణులు చెబుతుంటారు. అంతేకాదు అలా నేలపై కూర్చొని తినడమనేది ఆనాటి నుంచి కొనసాగుతున్న సంప్రదాయం అని చెబుతుంటారు. వాస్తవానికి అలా నేలపై కూర్చొని తినడం వల్ల ఉపయోగాలెన్నో ఉన్నాయని ముందుగానే గమనించిన పెద్దలు వాటిని సంప్రదాయంగా గుర్తించి అప్పటి నుంచి కొనసాగిస్తూ వస్తున్నారు. ఆ లాభాలేమిటంటే.. నేలపై మనం భోజనం చేసేందుకు కూర్చునే స్థితిలో ఒక ఆసనం ఏర్పడుతది. దానినే పద్మాసనం భంగిమ అంటారు. దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరిగి జీర్ణాశయ సంబంధ సమస్యలు దూరమవుతాయి. అంతేకాదు మానసిక ప్రశాంతంత కలుగుతుంది. కీళ్ల నొప్పులు దరిచేరవు. ఇలా పలు రకాలుగా మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి. సో.. మీరు కూడా నేల మీదే కూర్చొని తినడానికి ప్రాధాన్యతనివ్వండి.



Next Story