టెన్షన్ పడుతున్నారా.. ఇలా చేస్తే టెన్షన్ చిటికెలో మాయం -Bhramari Pranayama

by Anukaran |   ( Updated:2021-06-11 00:58:16.0  )
టెన్షన్ పడుతున్నారా.. ఇలా చేస్తే టెన్షన్ చిటికెలో మాయం -Bhramari Pranayama
X

దిశ, వెబ్ డెస్క్: ఉరుకుల పరుగుల జీవితం …. ఉద్యోగం, వ్యాపార పనుల్లో తీవ్ర ఒత్తుడులు.. దీని వలన శారీరక, మానసిక సమస్యలు…మానసిక ఒత్తిడి నుండి బయటికి రావడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇక దీని వలనే ప్రతి చిన్న విషయానికి టెన్షన్ కి గురవుతూ ఉంటారు. వారు అనుకున్నది జరగకపోయినా, ఆ పని కొంచెం ఆలస్యమైనా వెంటనే టెన్షన్ తో చెమటలు పట్టేసి కళ్ళు తిరిగి కిందపడిపోతుంటారు. దాన్నే మానసిక ఒత్తిడి అంటారు. ఇలాంటి టెన్షన్ లు దూరం చేయడానికి కొన్ని సింపుల్ చిట్కాలను తెలుసుకుందాం. మనిషి ఒత్తిడి నుండి త్వరగా బయటపడడానికి యోగా మేలు చేస్తుంది. బాగా టెన్షన్ లో ఉన్నప్పుడు ప్రాణాయామం చేస్తే త్వరగా రిలీఫ్ అవ్వొచ్చు.

ఈ ప్రాణాయామం లో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో సీత్కారి, భ్రమరి, మూర్ఛ, ప్లావని, ఉజ్జాయి, సూర్య భేద, భస్త్రిక, శీతలి వంటివి ప్రధాన ఆసనాలు అని చెబుతుంటారు. ఇందులోని భ్రమరి ప్రాణాయామం చేయడం వల్ల మానసిక ఒత్తిడిని దూరం చేయవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అందులోను భ్రమరి ప్రాణాయామం స్ట్రెస్ బూస్టర్ లా పనిచేస్తుందని, కోపం, ఆందోళన, నిద్ర లేమి వంటి సమస్యలకు కూడా ఈ భ్రమరి ఆసనం చక్కని పరిష్కారం అని చెబుతున్నారు.

ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే.. ముందుగా పద్మాసనంలో కూర్చోని… చేతి వేళ్లతో కళ్ళ మీద, ముక్కు మీద నొక్కి పెట్టాలి. ముక్కు రంద్రాల ద్వారా గాలిని గట్టిగా పీల్చి కొద్దీ సేపు గాలిని నిలపాలి. కొన్ని సెకన్ల తర్వాత ఆ గాలిని నోటి ద్వారా, ముక్కు ద్వారా వదలాలి. అలా ఒకసారి ముక్కు రంద్రాన్ని కుడి చేతితో, మరోసారి ఎడమ చేతితో మూస్తూ చేయాలి. ఇలా చేయడం వలన స్ట్రెస్ అదుపులోకి వచ్చి తక్షణ శక్తిని ఇస్తుంది. ఇక ఈ ఆసనం వేసవి లో చేయడం మంచిది. అధిక దాహం, వడ దెబ్బ వంటి వాటినుండి దూరం చేస్తుంది.

Advertisement

Next Story