బెంగాల్‌లో 10 హాట్‌స్పాట్‌లలో టోటల్ లాక్‌డౌన్

by  |

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో పది హట్‌స్పాట్‌లలో రాష్ట్ర సర్కారు టోటల్ లాక్‌డౌన్ విధించింది. ఈ ఏరియాల్లో ప్రజలను ఇంటి నుంచి కూడా బయట అడుగుపెట్టబోనివ్వమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ సిన్హా తెలిపారు. ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ.. లాక్‌డౌన్ పొడిగింపుకు అనుకూలంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. కాగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ సిన్హా.. తాజాగా పది హాట్‌స్పాట్‌లలో టోటల్ లాక్‌డౌన్‌ను 14 రోజుల పాటు అమలు చేయనున్నట్టు ప్రకటించారు కానీ, ఆ ఏరియాలేవో వెల్లడించలేదు. ఆ పది ఏరియాల్లో స్థానిక మార్కెట్లు, రోడ్లు పూర్తిగా బంద్ అవుతాయని, ఒక్కరు కూడా ఇంటి నుంచి బయట అడుగుపెట్టరాదని వివరించారు. కరోనా కేసులు అధికంగా నమోదైన ఏరియాలను హాట్‌స్పాట్‌లుగా పిలుస్తున్నామని చెప్పారు. ఈ ఏరియాల్లో పూర్తి లాక్‌డౌన్ ఉంటుందని, మరో ప్రత్యామ్నాయం లేనందున ఇది తప్పడం లేదని వివరించారు.

లాక్‌డౌన్ పాటించట్లేదు : కేంద్రం

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరుచూ లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు రిపోర్టులు వస్తున్నాయని కేంద్ర హోం శాఖ.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీకి లేఖ రాసింది. ప్రభుత్వమే కొన్ని మినహాయింపులనిస్తూ లాక్‌డౌన్ నిబంధనలు మెల్ల మెల్లగా ఎత్తేస్తున్నదని తెలిపింది. దుకాణాలు, అత్యవసరంకాని సరుకులను అమ్మే షాపులను ఓపెన్ చేయడానికి ప్రభుత్వం అనుమతినిస్తున్నదని ఉదాహరణగా పేర్కొంది. సామాజిక దూరాన్ని పాటించకుండా.. కూరగాయలు, చికెన్, మటన్ మార్కెట్‌లలో ప్రజలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారని వివరించింది. కానీ, సీఎం బెనర్జీ ఈ లేఖ గురించి తెలియదని తెలిపారు.

Tags: coronavirus, west bengal, mamata banerjee, hotspots, cs

Advertisement

Next Story