చేపల వేటకు వెళ్లి కరెంట్ షాక్‎తో మృతి

దిశ, నర్సంపేట: వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో విషాదం చోటు చేసుకుంది. పాకాల చెరువు సమీపంలోని వాగు వద్ద ఓ వ్యక్తి చేపలు పడుతుండగా విద్యుత్ ఘాతుకానికి గురై మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. చిలుకమ్మ నగర్‎కు చెందిన పున్నం వీరస్వామి (50) ఆదివారం సాయంత్రం చేపటల వేటకు వెళ్లాడు. వాగులో కరెంట్ తీగ పడి ఉండడాన్ని గమనించని వీరస్వామి నీటిలో దిగాడు. విద్యుత్ ప్రసరించడంతో వీరస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement