పరిమిత సంఖ్యలో ఆహ్వానం: సీఎం ప్రమోద్ సావంత్

by Shamantha N |
పరిమిత సంఖ్యలో ఆహ్వానం: సీఎం ప్రమోద్ సావంత్
X

గోవా అంటే పర్యాటకానికి పెట్టింది పేరు. సముద్రపు బీచ్‌లు నిత్యం పర్యాటకులతో కళకళాడుతుంటాయి. అక్కడి విభిన్న సంస్కృతులు ఎంతో ఆకట్టుకుంటాయి. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్‌తో గోవా పర్యాటకం కళ తప్పింది. ఆ రాష్ట్రానికి అత్యధిక ఆదాయం కూడా ఈ రంగం నుంచే వస్తుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ మే 17న ముగుస్తుంది. దీంతో గోవా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటకులను ఆహ్వానించేందుకు తమ రాష్ట్రం సిద్ధంగా ఉన్నట్లు సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్న మహారాష్ట్ర, కర్నాటక నుంచి మాత్రం ఎవరిని అనుమతించబోమని గోవా ప్రభుత్వం ప్రకటించింది. ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకుల రాక కోసం విమాన, రైలు, రోడ్డు రవాణా మార్గాలకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. ఈ నెల 17న తరువాత కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పరిమిత సంఖ్యలో పర్యాటకులను అనుమతిస్తామని సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed