కూలీలు లేకుండానే కలుపు తీత.. ఎలాగో తెలుసా..?

by Sridhar Babu |   ( Updated:2021-08-02 04:56:32.0  )
కూలీలు లేకుండానే కలుపు తీత.. ఎలాగో తెలుసా..?
X

దిశ, చేవెళ్ల: ప్రస్తుతం కూలీల కొరతతో రైతులు వ్యవసాయ పనుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట సాగులో కూలీల ఖర్చు విపరీతంగా పెరిగిపోవడంతో అందుకు ప్రత్యామ్నాయంగా కలుపు తీసేందుకు పవర్ టిల్లర్ ను వినియోగించి పెట్టుబడులు తగ్గించుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం ఆలం ఖాన్ గూడ గ్రామంలో రైతు శ్రీనివాస్ రెడ్డి తనకున్న పొలంలో కంది, మొక్కజొన్న, పత్తి, కూరగాయలు సాగు చేశాడు. కలుపు తీసేందుకు రోజువారీ కూలీ ఖర్చు రూ.350 చెల్లించాల్సి వస్తోంది.

వ్యవసాయ సాగులో పెట్టుబడుల ఖర్చులు కూలీల ఖర్చు అధికంగా రావడంతో కూలీలకు ప్రత్యామ్నాయంగా పవర్ టిల్లర్ వాడుతూ సత్ఫలితాలు పొందుతూ ఉన్నాడు. పవర్ టిల్లర్ 5 హెచ్.పీ రూ.40 వేల వరకు ఉంటుందని, అంతకన్నా ఎక్కువ సామర్థ్యం గల పవర్ టిల్లర్ రూ.80వేల వరకు ఉంటుందని పెట్రోల్ తో రైతు కలుపు తీయవచ్చని చెబుతున్నాడు. కాగా ప్రభుత్వం సబ్సిడీ పై ఇలాంటి వ్యవసాయ పనిముట్లు రైతులకు పంపిణీ చేస్తే రైతులకు మేలు కలిగే అవకాశాలున్నాయని చెబుతున్నాడు. రెండెకరాల పొలాన్ని రెండు గంటల్లో రెండు లీటర్ల పెట్రోల్ తో కలుపు తీయడం జరిగిందని తెలిపారు. కంది తో పాటు పత్తి, మొక్కజొన్న, టమోటా, మిరప ఇంకా ఇతర ఆరుతడి పంటలు లో కలుపు తీయవచ్చు అని చెబుతున్నాడు.

Advertisement

Next Story