- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బొమ్మ తుపాకీతో పెళ్లి బరాత్‌లో హల్‌చల్
దిశ, క్రైమ్ బ్యూరో: పాతబస్తీలోని ఓ పెళ్లి బరాత్‌లో పెళ్లి కొడుకు, అతని స్నేహితులు చేతులో గన్, కత్తులతో రోడ్లపై చిందులేసిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయాన్ని చంద్రాయణగుట్ట పోలీసులు సుమోటోగా స్వీకరించి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు. వివరాళ్లోకి వెళితే… బండ్లగూడ మొహమ్మద్ హిల్స్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అమీర్ షరీఫ్ గురువారం అర్థరాత్రి పెళ్లి వేడుక సందర్భంగా బరాత్ నిర్వహించాడు. ఈ సందర్బంగా పెళ్లి కొడుకు, అతని స్నేహితులు చేతిలో గన్, కత్తులు పట్టుకుని బహిరంగంగానే డ్యాన్స్‌లు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియో ఆధారంగా చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, కత్తులతో పాటు పట్టుకున్న గన్ అసలైనది కాదనీ, కేవలం బొమ్మ పిస్టల్ మాత్రమేనని పోలీసులు నిర్ధారించారు. ఈ తుపాకీతో సిగరెట్ కూడా అంటించుకోవడానికి వీలున్నట్టు తెలుస్తోంది. అయినా కూడా, పలువురు భయబ్రాంతులకు గురయ్యేలా ప్రదర్శనలు ఇవ్వడాన్ని చాంద్రాయణగుట్ట పోలీసులు తప్పు పడుతున్నారు. ఈ సందర్భంగా పెళ్లి కుమారుడు అమీర్ షరీఫ్‌తో పాటు అతని సోదరుడు ఇమ్రాన్ షరీఫ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సీఐ రుద్ర భాస్కర్ తెలిపారు.