మీ భార్య లేక భర్తకు అక్రమ సంబంధం ఉందని అనుమానమా.. అయితే ఈ విధంగా తెలుసుకోండి
సంసార జీవితం ఎంతో సంతోషంగా సాగుతున్నప్పటికీ కొన్ని పరిస్థితుల కారణంగా భర్త లేక భార్య వేరే వాళ్లతో అక్రమ సంబంధం ఏర్పచుకుంటారు.
భాగస్వామి నుంచి ప్రేమ దొరక్కపోవడం.. సరిగా ఇద్దరూ మాట్లాడుకోకపోవడం.. లేక ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవడమే ఈ అక్రమ సంబంధాలకు దారి తీస్తాయి.
ఈ అక్రమసంబంధాల కారణంగా ఎన్నో జీవితాలు, కుటుంభాలు నాశనం అవుతున్నాయి. అయితే.. మీ భాగస్వామి ఎవరితోనైనా సహజీవనం చేస్తుందా అనే విషయం ఎలా తెలుసుకోవాలంటే..?
ఎప్పుడూ మీతోనే కలిసి తినే భార్య లేక భర్త.. మీరు లేకుండా తినేసి తన పని తను చేసుకున్నట్లయితే వాళ్ల ఆలోచనలో ఏదో మార్పు వచ్చిందని అర్థం.
ఎప్పుడు ఆత్మీయంగా మాట్లాడే భార్య లేక భర్త కనీసం మాట్లాడటానికి కూడా ఇష్టపడక పోవడం, కోపం తెచ్చుకోవడం చేసినట్లయితే వేరే వాళ్ల మీదకి వారి ఆలోచనలు వెళ్లాయని అర్థం.
ఏకాంతంగా ఉన్న సమయంలో కూడా.. మీ భాగస్వామి మిమ్మల్నీ దూరం పెడుతున్నారంటే దాని అర్థం వారికి ఇతరులతో సంబంధం ఏర్పడినట్లే అని ఫ్యామిలీ కౌన్సిలర్లు అభిప్రాయ పడుతున్నారు.
అయితే.. భాగస్వామి పట్ల ప్రేమాభిమానాలు చూపించి, వారికి ఏ కష్టం వచ్చిన అండగా నేను ఉన్నాను అనే భరోసా ఇచ్చినట్లయితే ఎటువంటి సంబంధాలు దాంపత్య జీవితంలోకి రావు అని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.