మానవ శరీరానికి ఉప్పు చేసే మేలు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం..!

ప్రతి వంటకంలో ఉప్పు లేకుంటే దానికి టేస్ట్ రాదు. అలా అని ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
అయితే ఉప్పును తీసుకోవడం వల్ల నష్టాలు కాకుండా లాభాలు కూడా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మీ శరీరమంతా కీళ్ల నొప్పులతో కారణంగా వాపుతో బాధపడుతుంటే పాదాలను గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి. మీ కండరాలు రిలాక్స్ అయి వాపు తగ్గిపోతుంది.
ఉప్పు శరీరం పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే కడుపు నొప్పిని తగ్గిస్తుంది.
ఇటీవల చాలా మంది పంటి నొప్పితో బాధపడుతుంటారు. ఉప్పు నీటితో పంటి నొప్పికి చిగుళ్ల నొప్పికి చెక్ పెట్టవచ్చు.
ఉదయం పళ్లు తోమకముందు ఉప్పునీళ్లను నోట్లో పోసుకుని ఐదు నిమిషాలు ఉంచి పుక్కిలిస్తే బ్యాక్టీరియా అంత బయటకు పోయి నోటికి సంబంధించిన సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
చిన్న స్ప్రే బాటిల్‌లో తేలికపాటి వేడి నీటిని తీసుకుని అందులో ఒక టీ స్పూన్ ఉప్పు కలపాలి. ఉప్పు బాగా కరిగిన తర్వాత ముఖంపై స్ప్రే చేయాలి. అలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అధిక రక్తపోటును నియంత్రించడంలో ఉప్పు బాగా ఉపయోగపడుతుంది.
శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించి పలు అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తోంది.
ఉప్పును మోతాదుగా తీసుకోవడం వల్ల గుండె పోటు ప్రమాదం తగ్గే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఉన్న జీవన శైలిలో ఒత్తిడి, అలసట రావడం కామన్, అలాంటి వారు ఉప్పును తీసుకోవాలి.