పచ్చిమిర్చి తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం!
చాలా మంది పచ్చమిర్చిని చట్నీ దగ్గర నుంచి పప్పు వరకు అన్నీ వంటకాల తాలింపులో దీనిని ఉపయోగిస్తారు.
అలాగే కొంత మంది పచ్చిమిర్చి కారం ఉపయోగించి పలు రుచికరమైన వంటలు చేసుకుని తింటుంటారు. అయితే మిర్చి కారంగా ఉన్నా ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను కలిగేలా చేస్తుందట. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.
మిరపకాయల్లో విటమిన్ ఏ, బి6, కెతో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్, పొటాషియం, థయామిన్, ఐరన్, కాపర్ వంటి మినరల్స్ ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఇందులో ఉండే క్యాప్సైసిన్ అనే సమ్మేళనం అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు కొవ్వును కరిగించి నాజుకుగా తయారయ్యేలా చేస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పచ్చిమిర్చిలో ఉంటాయి కాబట్టి ఇవి పలు రకాల క్యాన్సర్లు రాకుండా చేస్తాయి.
పచ్చిమిర్చిని రోజూ తీసుకోవడం వల్ల గుండె జబ్బుల మరణాల రేటు తగ్గుతుంది. అలాగే షుగర్ అదుపులో ఉంటుంది.
పచ్చి మిరపకాయల్లో ఆస్కార్బిక్ యాసిడ్ ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండటం వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గేలా చేస్తుంది.
మిర్చి ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి. దీంతో జీర్ణ వ్యవస్థ మెరుగుపడి అజీర్తి వంటి సమస్యలు రావు.