మందులు వాడకుండానే ఈ ఆహార పదార్థాలతో ఈజీగా బీపీని తగ్గించుకోవచ్చు..!

ప్రస్తుతం తినే ఆహార పదార్థాల మార్పుల వల్ల ఇటీవల చాలా మంది బీపీ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో హైబీపీ, లోబీపీ ఉన్నా మందులు కచ్చితంగా ఉపయోగిస్తుంటారు.
అయితే మందులు వాడకుండా బీపీని తగ్గించుకోవాలంటే ఆ పదార్థాలు తినాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రతి వంటకంలో ఉపయోగించే ఉల్లిపాయ తినడం వల్ల ఇందులో ఉండే ఫ్లెవొనాల్ బీపీని తగ్గిస్తుందట.
అలాగే అందుబాటులో ఉండే పుచ్చకాయలోని ఫైబర్, లైకోపిన్ రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి.
పొటాషియం, ఫైబర్, ఫోలేట్ ఉన్న బచ్చలి కూర తినడం వల్ల కూడా బీపీని తగ్గించుకోవచ్చు.
కెరోటిన్ బ్లడ్ ఉండే క్యారెట్ రక్తపోటును తగ్గించడంలో సహాయ పడతాయి. దీంతోపాటు బ్లాక్ టీ కూడా మంచి ఫలితాలను అందిస్తుంది.
సన్‌ఫ్లవర్ గింజలు బీపీని తగ్గించడమే కాకుండా గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి.
ఆరోగ్యంగా ఉండాలని వైద్యులు పండ్లు తినాలని సూచిస్తుంటారు. ముఖ్యంగా యాపిల్, బెర్రీస్, కివీ, పైనాపిల్ తింటే బీపీ తగ్గుతుంది.
హైపర్ టెన్షన్ నుంచి ఉపశమనం పొందాలంటే బీట్‌రూట్‌ను మీ డైట్‌లో చేర్చుకోవాలి.