ఉద్యోగం చేసేవాళ్లు రోజుకు కనీసం 8 గంటల పాటు కూర్చొనే ఉంటారు. దీనివల్ల ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయో చుద్దాం.

సాధారణంగా మన వెన్నెముక ‘‘S’’ ఆకారంలో ఉంటుంది. కానీ రోజు చాలా సమయం వరకు కూర్చొని పని చేస్తే 5 ఏళ్లకు అది ‘‘C’’ షేప్‌గా మారుతుంది.
ఆ కారణంగా గుండె సంబంధ వ్యాధులు ఎక్కువగా వస్తాయి. ఈ క్రమంలో కొలెస్ర్టాల్ పేరుకుపోతుంది.
నిరంతరాయంగా కూర్చొని వర్క్ చేయడం వల్ల కాళ్లలో ఉండే రక్తం గడ్డ కడుతుంది. రక్త నాళాల్లో రక్త ప్రసరణ జరగదు.
ఈ సమస్య ఎక్కువైతే కాళ్ల వాపులు వస్తాయి. దీన్నే ‘‘వెరికోస్ వీన్స్’’ అంటారు.
కాళ్లను మడిచి లేక ఒక దానిపై మరో కాలు వేసుకుని కూర్చునే వారిలో ఈ సమస్య తొందరగా దరి చేరుతుంది.
ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం వల్ల రోజు రోజుకు జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. ఇన్సులిన్ సరిగ్గా గ్రహించక, రక్తంలో గ్లూకోజ్ అధికంగా పేరుకుపోయి డయాబెటిస్‌కు దారితీస్తుంది.
ఎలాగైనా ఒకరోజులో కనీసం 30నిమిషాల పాటు మీ శరీరం నుంచి చెమట బయటికి వదిలేలా చేయండి.
ప్రతి రోజు వ్యాయామం చేయడం వల్ల కొవ్వు కరిగి, రక్త సరఫరా బాగా జరిగి.. మీ బాడీని ఉత్తేజపరుస్తుంది.