ఫాదర్స్ డే అసలు ఎందుకు జరుపుకుంటారు.. దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసా?
పిల్లల దృష్టిలో తల్లిదండ్రులు ఇద్దరూ సమానమైనప్పటికీ చాలా మందికి తండ్రిపై ఎక్కువ ప్రేమాను రాగాలు ఉంటాయి.
అయితే పుట్టగానే తండ్రి మొదటి అడుగు వేయించడంతో పాటు చనిపోయేవరకు తమ బిడ్డ జీవితం గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు. ఆయన సేవలు, త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫాదర్స్ డే నిర్వహిస్తారు. అది ఎలా వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం.
భారత్‌లో జూన్ మూడో ఆదివారం జరుపుకుంటారు. 1910లో తొలిసారి అధికారికంగా అమెరికాలో సోనోరా డాడ్ ఫాదర్స్ డేని ప్రారంభించారు.
సోనోరా చిన్నప్పుడే తల్లి మరణించడంతో తండ్రి విలియం స్మార్ట్ అతనికి తల్లిదండ్రుల ప్రేమను కలిపి చూపించాడు. దీంతో తండ్రి అంకితభావాన్ని చూసి సోనేరా మదర్స్ డే తరహాలోనే ఫాదర్స్ డే జరుపుకోవాలని నిర్ణయించుకుందట.
దీంతో జూన్ 19న 1909 లో డాడ్ మొదటిసారి ఫాదర్స్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ తర్వాత 1924లో ఉన్న అమెరికా అధ్యక్షుడు కాల్విన్ కోలీ తండ్రుల దినోత్సవాన్ని అధికారికండా ఆమోదించారు.
ఆ తర్వాత పలు దేశాలతో పాటు భారత్‌లో కూడా ఆ ఫాదర్స్ డేను జూన్ మూడవ ఆదివారం జరుపుకోవడం ప్రారంభించారని సమాచారం.