శిశువులు ఎంత ఏడ్చినా కన్నీళ్లు ఎందుకు రావు.. షాకింగ్ విషయాలు చెప్పిన నిపుణులు!
కొంత మందికి నవ్వినా, ఏడ్చినా కన్నీళ్లు వస్తాయి. అయితే పుట్టిన పసి పాపలు ఎంత ఏడ్చినా కళ్లకు నీరు రాకపోవడం అందరికీ ఆశ్చర్యకరమైన విషయమే.
దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించారట. అందులో షాకింగ్ విషయాలు తెలిసినట్టు నిపుణులు వెల్లడించారు.
ఒక వ్యక్తి ఏడ్చినప్పుడల్లా కన్నీళ్లకు ఒక ప్రత్యేక రకమైన వాహిక వహిస్తుందట. కానీ, నవజాత శిశువులో ఈ వాహిక పూర్తిగా అభివృద్ధి చెందదు.
కాబట్టి శిశువులు ఎంత ఏడ్చినా కన్నీళ్లు రావు. ఈ వాహిక అభివృద్ధి చెందిన తర్వాతే కన్నీళ్ల రావడం ప్రారంభమవుతాయి.
దానికి దాదాపు రెండు వారాల టైమ్ పడుతుందని వైద్యులు తాన్యా ఆల్డ్ మన్ వెల్లడించారు. అయితే కొంతమంది చిన్నారుల్లో ఆ వాహిక అభివృద్ధి చెందడానికి 2 నెలలు కూడా పట్టవచ్చని తెలిపారు.
కంటి ఎగువ, కనురెప్పకు దిగువన బాదం ఆకారపు గ్రంథి ఉంటుంది. ఈ గ్రంథి నుంచి కన్నీళ్లు వస్తాయి. కన్నీటిని ఉత్పత్తి చేసే ఈ గ్రంథి మేఘంలాగానూ, నాళం గొట్టంలానూ ఉంటుందట. దీని ద్వారా కళ్లలో నుంచి నీళ్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.