పొద్దున నిద్ర లేచిన కానుంచి సబ్బులను ఏదో ఒక సమయంలో ఉపయోగిస్తూనే ఉంటాం. టెక్నాలజీ అభివృద్ధి చెందినప్పటి నుంచి ఎన్నో రకాల కొత్త సబ్బులు అందుబాటులోకి వచ్చాయి.

అయితే కొంత మంది సబ్బు గురించి ఏం తెలుసుకోకుండా ఎంత పడితే అంత డబ్బును ఖర్చు చేసి కొంటుంటారు.
అయితే సబ్బులను కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించకపోతే డబ్బు వృథా అవడంతో పాటు పలు రకాలు సమస్యలు వచ్చే అవకాశం ఉందట.
సబ్బును కొనేప్పుడు అందులో TFM శాంత ఎంత ఉందో చూడాలి. 80%ఉంటే అది ఫస్ట్ గ్రేడ్ సోప్ అన్నట్టు. దానికి ఎంత రేటు అయినా పెట్టి కొనవచ్చు.
అలాగే ఒకవేళ 72 % TFM కలిగి ఉంటే అది సెకండ్ గ్రేడ్ సోప్ అని అర్థం.
TFM 65 ఉంటే అది థర్డ్ గ్రేడ్ సోప్ కాబట్టి దీనికి ఎక్కువ రేటు ఉంటే దానిని కొనకపోవడం మంచిది.
TFM 50% కంటే తక్కువగా ఉంటే అది సబ్బు కాదు వాటిని బాతింగ్ బార్ అంటారు.