ఊపిరితిత్తుల్లో వచ్చే కేన్సర్ సాధారణంగా శ్వాసనాళాలు, చిన్న గాలి సంచుల్లో వస్తుంది. ఇది మెల్లిమెల్లిగా అన్ని భాగాలకు స్ర్పెడ్ అవుతుంది.
ఈ విధంగా లంగ్స్‌పై ప్రభావం చూపి వాటి పనితీరు తగ్గుతుంది. అయితే ఈ సమస్య ఎలా దరిచేరుతుందో.. వీటి లక్షణాలు ముందే కనిపెట్టడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ముఖ్యంగా సిగరెట్ ఎక్కువగా తాగేవారికి ఈ కేన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఆ అలవాటుని మానేసినా కూడా చాలా ఏళ్ల వరకు ఎఫెక్ట్ ఉంటుందట.
సిగరెట్స్, సిగార్స్, పొగాకు ఉత్పత్తులు ఇలా ఏవైనా సరే సమస్య రావడానికి కారణాలే. వీటిని తీసుకోవడం వల్ల 80 శాతం లంగ్ కేన్సర్ వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
దగ్గుతున్నప్పుడు రక్తం పడడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి, బరువు తగ్గడం, తలనొప్పి, ఆకలి తగ్గడం, భుజం నొప్పి, గురక వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఊపిరితిత్తుల కేన్సర్ లక్షణాలు మొదట్లో ఇతర సాధారణ సమస్యల మాదిరిగానే ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి.
అవసరమనుకుంటే బ్లడ్ టెస్ట్, ఛాతీ ఎక్స్‌రేలు తీయించుకోవాలి. సమస్య ఉందని తేలితే మరోసారి సిటి స్కాన్, బయాప్సీ వంటి ఇమేజింగ్ టెస్టులు కూడా చేస్తారు.
ఇతర పరీక్షల్లో కేన్సర్ వ్యాప్తి అనేది తెలుసుకోవడానికి PET/CT స్కాన్‌ని తీస్తారు. వీటి ద్వారా సమస్య నుంచి ముందుగానే బయటపడే ఛాన్స్ ఉంటుంది.