పీరియడ్స్ టైంలో అమ్మాయిలు చాలా సమస్యలు ఎదుర్కొంటారు.

కడుపు నొప్పి, అధిక బ్లీడింగ్, PCOD, నీరసం, కాళ్లు చేతులు లాగడంలాంటి ప్రాబ్లమ్స్‌ను ఫేస్ చేస్తుంటారు.
నిత్యం పీరియడ్ సమస్యలతో బాధపడే వారు ఈ ఫుడ్ తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
పాలకూర: బ్లీడింగ్ వల్ల ఐరన్ లెవెల్స్ తగ్గి, నీరసించిపోతారు. ఆ టైంలో పాలకూర లాంటి ఆకుకూరలు తింటే ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి.
అల్లం: సాధారణ కాఫీ, టీకి బదులు అల్లం ఛాయ్ ట్రై చేయండి. తలనొప్పి, విరేచనాలు లాంటి సమస్యలు తగ్గుతాయి.
డార్క్ చాక్లెట్: ఐరన్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల కూడా ఉపశమనం ఉంటుంది
తాజా, నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లు తినాలి. ఇది నీరసాన్ని తగ్గిస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.
పై సూచనలు పాటించే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి