కుంకుమ కింద పడితే శుభమా.. అశుభమా..?

మన హిందూ సంప్రదాయంలో కుంకుమకు ఎంతో ప్రాధాన్యత ఉంది.
పెళ్లిళ్లకు, పేరంటానికి పిలవడానికి.. లేదా ఎవరైనా కొత్తగా మన ఇంటికి వచ్చిన వారికి బొట్టు పెట్టడానికి ఇలా ప్రతి సందర్భానికి కుంకుమ ఉపయోగిస్తుంటాం.
అయితే.. మనం బొట్టు పెట్టుకునేటప్పుడు, లేదా పూజలు చేసేటప్పుడు ఇలా చాలా సందర్భాల్లో కుంకుమ కిందపడిపోతుంది.
కుంకుమ కింద పడితే చాలా మంది అశుభంగా భావిస్తారు. ఏదో జరగబోతుందంటూ కంగారు పడతారు. అయితే అది అపోహ మాత్రమే.
కుంకుమ కింద పడటం మంచిదేనని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
నిజానికి కుంకుమ గానీ, కుంకుమ భరిణి కానీ కింద పడటం శుభ సూచకం.
అలా కుంకుమ కింద పడటం భూమాత తనకు బొట్టు పెట్టమని చేసే సంకేతమట.
ఏదైన పూజ, లేదా వ్రతం చేస్తున్న సమయంలో కుంకుమ కిందపడటం అత్యంత శుభకరం అంటున్నారు పండితులు.