వాటర్ ఫాస్టింగ్ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
బరువు తగ్గడానికి డైటింగ్‌తో పాటు రకరకాల ఉపవాసాలు చేస్తాం. వీటిల్లోకి తాజాగా నీటి ఉపవాసం కూడా వచ్చి చేరింది.
కొత్తగా వచ్చిన ఈ నీటి ఉపవాసం అంటే ఏమిటి..? దాని ప్రయోజనాలు, నష్టాలు ఏంటో చూద్దాం.
నీటి ఉపవాస సమయంలో ఒక వ్యక్తి నీరు తప్ప మరేది తినకూడదు, తాగకూడదు. ఈ ఉపవాసం సాధారణంగా 24 నుండి 72 గంటల వరకు ఉంటుంది.
నీటి ఉపవాసం శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. కొవ్వు తగ్గడం వల్ల బరువును తగ్గిస్తుంది. కణాలను రీసైకిల్ చేయడానికి, క్యాన్సర్ వ్యాధులతో దెబ్బతిన్న భాగాలను తొలగించడంలో సహాయపడుతుంది.
ఇన్సులిన్ మెరుగ్గా పని చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బులు, అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
నీటి ఉపవాసాన్ని వైద్యుల సలహా లేకుండా చేయడం ప్రమాదమే. ఈ ఉపవాస సమయంలో కొవ్వుతో పాటు కండరాలు కూడా బలహీనపడతాయి.
నీరు మాత్రమే తాగడం వల్ల శరీరంలో శక్తి లోపించి అలసట, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.
డీహైడ్రేషన్ అనంతరం విరోచనాలు అవుతాయి. ఫుడ్ మీద ఆసక్తి ఉండదు. ఏమీ తినాలనిపించదు. ముఖంలో జీవకళ పోతుంది.