రాష్ట్రంలో కండ్లకలక అంటువ్యాధి కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో చిన్నా పెద్ద అందరూ భయపడుతున్నారు.
దీని లక్షణాలు బ్యాక్టీరియా, వైరస్, ఎలర్జీ ఇన్ఫెక్షన్లు వల్ల రావచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. కళ్లు ఎరుపెక్కడం, దురద, కను రెప్పలు ఉబ్బినట్టు అనిపించడం దీని లక్షణాలు.
అయితే ఈ కేసులు చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి. కాబట్టి పలు జాగ్రత్తలు తీసుకుంటే కండ్లకలక నుంచి రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఏదో ఒక పని చేసి అలాగే చేతులను కంట్లో పెట్టుకున్నప్పుడు ఇన్ఫెక్షన్లు వస్తాయి. అలా రాకూడదంటే శుభ్రంగా కడుక్కోవడం వల్ల క్రీములు దరిచేరకుండా ఉంటాయి.
చేతులు ఎలా ఉన్నా సరే కళ్లలో ఏదైనా పడినప్పుడు అలాగే ముట్టుకోకుండా, నలపకుండా శుభ్రంగా ఉన్న క్లాత్‌ను ఉపయోగించాలి.
అలాగే గాలి ద్వారా ఇన్ఫెక్షన్ దరిచేరకుండా ఇతరులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు దూరంగా ఉండి టిష్యూలు అడ్డంగా పెట్టుకుని పలు జాగ్రత్తలు తీసుకోవాలి.
అలాగే కళ్లద్దాలు, కాంటాక్ట్ లెన్సులు వంటి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని వాడుతుండాలి.
ఇతరులు వాడిన కర్చీఫ్‌లు, టవల్ వాడకుండా మీకు మీరు సెపరేట్‌గా వాడాలి.
ఫ్లూ లక్షణాలేమైనా కనిపిస్తే వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి. కండ్లకలక ఉన్న వారికి దూరంగా ఉండాలి.