డ్రై ఆప్రికాట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే?

ఆప్రికాట్ పండ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవని అందరికీ తెలిసిందే.
ముఖ్యంగా ఎండబెట్టిన ఆప్రికాట్స్‌ను తింటే మంచి ఫలితాలుంటాయని ఆరోగ్య నిపుణుల సలహా
వీటిల్లో క్యాల్షియం, విటమిన్ ఎ, పొటాషియం, ఐరన్, విటమిన్ సి ఉండి ఆరోగ్యానికి మేలు కలిగిస్తాయి.
రక్తహీనత సమస్యతో బాధపడేవారు డ్రై ఆప్రికాట్స్‌ను తింటే హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి మంచి ఉపశమనం ను కలిగిస్తాయి.
అలాగే ఆప్రికాట్స్ తినడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి.
ఈ డ్రై ఆప్రికాట్స్‌ను ప్రతి రోజూ తీసుకుంటే వివిధ రకాల కంటి సమస్యలు, మలబద్ధకం వంటివి దరిచేరకుండా ఉంటాయి.
ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి శరీరం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.