ఈ ఐదు విత్తనాలతో బరువు తగ్గడం ఖాయం.. నిపుణులు తెలిపేది ఇదే

ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొనే సమస్య అధిక బరువు. అది తగ్గించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.
వ్యాయామాలు చేయడం, డైట్ ఫాలో అవ్వడం లాంటివి చేస్తుంటారు. అయినా కానీ ఆశించిన ఫలితం దక్కదు.
అయితే.. మీ డైట్‌లో ఈ విత్తనాలు చేర్చుకుంటే త్వరగా బరువు తగ్గడమే కాకుండా హెల్తీగా ఉంటారని తెలుపుతున్నారు హెల్త్ నిపుణులు. ఇంతకీ ఆ విత్తనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పొద్దుతిరుగుడు విత్తనాలు: ఇందులో ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఈ గింజల్లో ఉండే విటమిన్లు, మినరల్స్ జీర్ణక్రియను మెరుగుపరిచి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి.
చియా సీడ్స్: ఇవి ఆకలి తగ్గించి.. బరువును కంట్రోల్‌లో ఉంచుతాయి. అంతే కాకుండా వీటిలో ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, ప్రొటీన్లు, పోషకాలు అధికంగా ఉంటాయి.
అవిసె గింజలు: ఈ గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటితో పాటు ఒమెగా-3, పీచు పుష్కలంగా ఉండటం వల్ల గుండెకు మేలు జరుగుతుంది.
గుమ్మడి గింజలు: ఈ గింజలు మీ డైట్‌లో చేర్చుకుంటే మంచిది అంటున్నారు నిపుణులు. ఇవి నిండుగా ఉండి ఫుడ్ క్రేవింగ్స్‌ను తగ్గిస్తాయట. అంతే కాకుండా వీటిలో ప్రొటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు సమద్ధిగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి.. బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది.
నువ్వులు: బరువు తగ్గాలి అనుకునే వారికి ఇవి సరైన ఆహారం. నువ్వుల్లో ప్రొటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. మీ డైట్‌లో వీటిని చేర్చుకున్నట్లయితే.. కొలస్ట్రాల్‌తో పాటు, ట్రైగ్లిజరాయిడ్లు అదుపులో ఉంటాయట. దీంతో గుండె సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది అంటున్నారు నిపుణులు.