యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నారా? అయితే మోస్ట్ వ్యూస్ వచ్చే బెస్ట్ ఐడియాస్ ఇవే?
చాలా మంది కొత్త కొత్త ఆలోచనలతో వీడియోలు చేసి తమలో ఉన్న టాలెంట్‌ను ప్రపంచానికి తెలియజేయాలనుకుంటారు.
మరికొంతమంది డబ్బులు సంపాదించాలనే ఆకాంక్షతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి పలు వీడియోలు చేస్తారు.
యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వారు ఎలాంటి వీడియోలు చేయాలో తెలియక సతమతమవుతుంటారు.
అలాంటి వారు ఏ ఏ కేటగిరీల్లో ఎలాంటి వీడియోలు చేయవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కేవలం వీడియోలు పోస్ట్ చేసి యూట్యూబర్ అవ్వాలనుకునే వారు టెక్, అన్‌బాక్సింగ్ ఐటెమ్స్‌కు సంబంధించిన వీడియోలు చేస్తే చాలు. మంచి వ్యూస్ మీ సొంతమవుతాయి.
న్యూ మోడల్ స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రిక్ డివైస్‌లు మార్కెట్లలోకి వచ్చినప్పుడు, వాటిని అందరికంటే ఫస్ట్ అన్ బాక్స్ చేసి వాటి గురించి చక్కగా వివరించండి. గాడ్జెట్‌లపై రివ్యూలు కూడా ఇవ్వండి.
మహిళలకు సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్, వంటలు, భక్తి ఇన్ఫర్‌మేషన్ ఇలా ఏ అంశంపైనైనా మంచి గ్రిప్ ఉంటే చాలు.
మీకు ఒక సబ్జెక్టుపై మంచి పట్టు ఉంటే దాన్ని ఒక కోర్సుగా రూపొందించి యూట్యూబ్ ఛానల్‌లో ఆన్‌లైన్ క్లాసులు చెప్పండి.
ట్రావెల్ వీడియోలు, పలు రెస్టారెంట్లలో స్పెషల్ ఫుడ్‌కు సంబంధించిన వీడియోస్ చేయండి. ప్రస్తుత రోజుల్లో వీటికి ప్రత్యేకమైన ఆదరణ పొందుతున్నాయి.
స్ఫూర్తిదాయకమైన మోటివేషనల్ వీడియోలు చేయండి.
చిన్నపిల్లల్ని ఆకట్టుకునే పెయింటింగ్, డాన్స్, సంగీతం ఇలా రకరకాల కళలు నేర్పించడానికి ట్యుటోరియల్స్ ఛానల్ పెట్టుకోండి.