నిత్య యవ్వనంగా ఉండాలనుకుంటున్నారా..! అయితే ఇవి తీసుకోవాల్సిందే..

వయసు వస్తున్న కొద్ది ముఖంలో వృద్ధాప్య ఛాయలు రావడం చాలా కామన్.
కానీ ఇప్పుడున్న జనరేషన్‌లో పొల్యూషన్‌, సరైన తిండి లేకపోవడం, కాల్తీ ఆహారం వీటి కారణంగా వయసులో ఉన్న వారికి కూడా వృద్ధాప్యం వచ్చేస్తుంది.
అయితే.. ఇలా వృద్ధాప్య ఛాయలు నుంచి మీ శరీరాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారా.. అయితే వీటిని తెలుసుకోండి.
శరీరానికి అతి ముఖ్యమైనది విటమిన్ సి. అది లోపిస్తే.. అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. విటమిన్ సి శరీరంలో రోగ నిరోధకశక్తి.. వైరల్ ఇన్ ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.
అంతే కాకుండా శరీరంలో విటమిన్ సి లోపం కారణంగా మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి షుగరు వ్యాధిగ్రస్తులు విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తీసుకోవడం మంచిది.
విటమిన్ సి లోపిస్తే శరీరంలో రక్త హీనత ఏర్పడుతుంది. దీని కారణంగా గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
విటమిన్ సి శరీరంలో ఐరన్ గ్రహించడానికి సహాయపడుతుంది. అది లోపిస్తే దంతాలు, చిగుళ్లు బలహీనపడతాయి. ఇన్ ఫెక్షన్ పెరిగి గాయాలు కూడా మానకుండా అలాగే ఉంటాయి.
సిట్రస్ పండ్లు, నారింజ, నిమ్మకాయ, కివి, బొప్పాయితోపాటు వివిధ రకాల కూరగాయల నుంచి విటమిన్ సి లభిస్తుంది.
విటమిన్ సి ఎముకలు, కణజాలాలు, సిరలు, ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి చాలా ముఖ్యమైంది. కాబట్టి అది లోపించకుండా చూసుకోవాలి.
అయితే.. కొందరికి యవ్వనంలోనే చర్మంపై ముడతలు ఏర్పడతాయి. దీనికి కారణం విటమిన్ సి లోపించడం. అలాంటి వారు విటమిన్-సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మీరు కావాలి అనుకున్న వృద్ధాప్యం మీ చెంత చేరదు.
నోట్: పైన ఇచ్చిన సమాచారం అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లీనికల్ న్యూట్రీషియన్‌లో వచ్చిన వ్యాసం ఆధారంగా తెలపడం జరిగింది. శరీరానికి సంబంధించి ఎలాంటి సమస్య వచ్చిన వైద్యులను సంప్రదించడం మంచిది.