గీజర్ వాడుతున్నారా? అయితే ఈ టిప్స్ పాటించకపోతే అంతే సంగతి!

ప్రస్తుత రోజుల్లో గీజర్ వాడకం ఎక్కువైపోయింది.
నాటి కాలంలో కట్టెల పొయ్యి, బొగ్గు పొయ్యిల మంటపై వేడినీటిని కాచేవారు.
కానీ ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా బాత్‌రూమ్‌లోనే గీజర్స్‌ను పెట్టించుకుంటున్నారు. స్విచ్ ఆన్ చేయగానే నిమిషాల్లో వేడి నీరు వస్తుంది.
అయితే వీటిని సరిగా వాడకపోతే అవి పేలిపోతాయి. ఇందుకోసం పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో చూద్దా..
గీజర్ ఎక్కువసేపు ఆన్ చేసి ఉంచడం వల్ల వేడెక్కి.. పేలే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా స్విచ్ ఆఫ్ చేయాలి.
రెండేళ్లకోసారైనా రీసైజ్ చేయాలి. లేకపోతే షార్ట్ సర్క్యూట్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
గీజర్‌ను ఎక్కడ పెట్టినా గోడకు, గీజర్‌కు మధ్య కాస్తైనా ఖాళీ ఉంచాలి.
10 నుంచి 35 లీటర్ల గీజర్ ఉండేలా చూసుకోండి. టెంపరేచర్ ఎప్పుడు కూడా 60 డిగ్రీలు, అంతకంటే ఎక్కువగా ఉండేలా చూసుకోండి.