రక్త హీనతను తగ్గించడం, చర్మ సమస్యలు పోగొట్టడంలో ఈ ఆకు ప్రకృతి మనకు ఇచ్చిన వరం
ప్రకృతి మనకు ఎన్నో ఔషధాలను ఇస్తుంది. వాటిలో కరివేపాకు ఒకటి.
కరివేపాకులో కాల్షియం, ఐరన్, జింక్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి రక్తహీనతతో పోరాడి.. సమస్యను అదుపులో ఉంచుతాయి.
కరివేపాకు పొడిని తేనెలో కలుపుకుని నోటి పూత ఉన్న చోట్ల రాసినట్లయితే.. రెండు మూడు రోజుల్లో చక్కటి ఉపసమనం కలుగుతోంది.
చర్మ సమస్యలకు కరివేపాకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇందులో ఉండే పోషకాలు చర్మంపై నూనెను తగ్గించి మొటిమలు లేకుండా చేస్తాయి. చర్మం పసుపు రంగులోకి మారకుండా మేలు చేస్తుంది.
కరివేపాకులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో ఐరన్ స్థాయిలను పెంచుతుంది. రోజు కొన్ని కరివేపాకు ఆకులు తినడం వల్ల ఐరన్ లోపాన్ని నివారించవచ్చు.