స్త్రీ, పురుషులకు ఏ వయస్సు వరకు పిల్లలు పుడతారు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో పలు కారణాల వల్ల చాలా మంది పెళ్లి చేసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో కొంత మందికి లేట్ ఏజ్‌లో వివాహం చేసుకోవడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుంది.
అయితే మగవారిలో, ఆడవారిలో ఎంత వయస్సు వచ్చే వరకు పిల్లలు పుడతారో నిపుణులు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
కొంత మంది మగవారిలో వయసు పెరిగు కొద్ది పలు కష్టాలు, ఇబ్బందులు చిక్కులు పెరిగిపోతాయి. శరీరంలో మార్పులు జరిగి తండ్రి అయ్యే అవకాశాన్ని కోల్పోతారట.
అలాగే పురుషులకు కొంత వయస్సు వచ్చిన తర్వాత వారి స్మెర్మ్ కౌంట్ తగ్గుతుంది. ఇది స్త్రీలకు గర్భం దాల్చడం కష్టతరంగా చేస్తుందట.
అలాగే పురుషుల్లో తండ్రి కావడానికి ముఖ్యమైన వయస్సు 22. నుండి 35 సంవత్సరాలు ఉత్తమమైనదిగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాగే స్త్రీలలో పుట్టినప్పటి నుండి నిర్దిష్ట సంఖ్యలో గుడ్లు ఉంటాయి. అది కొంత కాలానికి తగ్గిపోయి సంతానోత్పత్తి సమస్యలు ఎదురవుతాయి.
మహిళలు తల్లులు కావడానికి 20 నుంచి 30 సంవత్సరాల వయస్సు సరైనది. దీని తరువాత, మహిళల్లో ఎగ్స్ తగ్గడం ప్రారంభిస్తాయి. అందువల్ల, తల్లి కావడానికి అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
కొంత మంది మహిళ 40, 50 సంవత్సరాల మధ్య సంతానోత్పత్తి వేగంగా క్షీణించడం ప్రారంభం అవుతుంది. కాబట్టి అది కష్టం మీద తల్లి అవుతారు.