నిమ్మకాయతో చికిత్స.. దీంతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

అజీర్ణం: కొద్ది నీటిలో ఒక చెక్క నిమ్మరసం కలిపి దానిని ఒక మోతాదుగా పుచ్చుకొనవలెను. దీనివల్ల జీర్ణాశయం గోడలు శుభ్రం కావడంతో పాటు.. గుండెల్లో మంట, పులిత్రేపులు రాకుండా కాపాడుతుంది. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు నిమ్మరసం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
మలాశయం బాధ: నిమ్మ పండు రసం కలరా వంటి పేగు బాధలు నివారణకు సహాయపడుతుంది. అంతే కాకుండా జిగట విరేచనాలు తీవ్రమైనప్పుడు నిమ్మ రసం నివారిస్తుంది.
అధిక బరువు: నిమ్మ రసం అధిక బరువుతో బాధపడేవారికి సహాయపడుతుంది. మూడు నాలుగు గ్లాసుల తీపి కలపని నిమ్మరసం తీసుకున్నట్లయితే బరువు తగ్గుతారు. దీంతో పాటు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆహారం తీసుకోకూడదు. ఎందుకంటే మధ్యాహ్నం భోజనం అధిక బరువును పెంచుతుంది.
ముఖ సౌందర్యం: సామాన్యంగా ముఖం పైన దీనిని వాడినప్పటి కంటే లోపలికి తీసుకున్నప్పుడు అద్భుతంగా పనిచేయును. నిమ్మకాయ చెక్కని తలపైన రుద్దిన చుండ్రు పోతుంది. ముఖం మెరవడానికి, శరీరంపై మచ్చలు, వాపు, గజ్జి వంటి వాటిని తగ్గించేందుకు కూడా నిమ్మరసం చాలా ఉపయోగపడుతుంది.
చలి జ్వరం: చలి జ్వరానికి నిమ్మకాయ రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలాకాలం నుంచి చలి జ్వరమునకు, రొంపలకు మందుగా వాడుతున్న సింకోనా క్వయినా తయారగు చెట్టు బెరడులో ఉండే గుణాలు అన్నియు నిమ్మకాయలో ఉంటాయి.
రక్తస్రావం: శ్వాసకోశములు, అన్నకోశం, ప్రేగులు మూత్రపిండములు మొదలగు వాటి నుండి రక్తస్రావం అవుతున్నప్పుడు నిమ్మరసం ఇవ్వవలెను. ఉప్పు కలిపి రోజుకి ఒక నిమ్మకాయ తీసుకున్నట్లయితే ప్లీహ వృద్ధి అనగా కడుపులో బల్ల పెరుగుట హరించును.
నిమ్మ తైలముతో మర్దన: నిమ్మరసాన్ని శరీరానికి, తలకి మర్దనగా కూడా ఉపయోగించుకోవచ్చు. దీని కారణంగా చర్మం మెరవడంతో పాటు స్ట్రాంగ్‌గా ఉంటుంది.
దంత శుద్ధి: దంతాలు బలహీనంగా ఉన్నా రంగుమారిన వాటిపై ఎలాంటి పేస్ట్ వాడరాదు. అవి హాని చేయును. అటువంటి సమయాల్లో నిమ్మ పండ్ల రసంలో తడిపిన కట్టె బొగ్గు ఉపయోగించాలి. ఇది వాడిన తర్వాత నీటితో నోరు బాగా పుక్కిలించవలెను. నిమ్మరసాన్ని నీటిని సమాన భాగాలుగా తీసుకుని పుక్కిలించి నట్లయితే చిగుళ్ల వాపును, నోటి పూతను తగ్గిస్తుంది.