ముఖం అందంగా నిగనిగలాడాలంటే రోజ్ వాటర్‌తో ఇలా చేయాల్సిందే..

మన ముఖ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో రోజ్ వాటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
రోజ్ వాటర్‌లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉండి చర్మాన్ని రక్షిస్తాయి.
రోజ్ వాటర్‌లో కాటన్ ముంచి కళ్ల కింద అప్లై చేసుకోవాలి. రోజూ ఇలా చేయడం ద్వారా నల్లటి వలయాలు దూరం అవుతాయి.
రోజ్ వాటర్‌లో ఉండే విటమిన్ సి యాంటీఆక్సిడెంట్‌లా పనిచేసి సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.
రోజ్ వాటర్ రోజూ ముఖానికి అప్లై చేయడం ద్వారా.. ముఖంపై ఉండే జిడ్డు పోయి చర్మం ఫ్రెష్‌గా ఉంటుంది.
అంతేకాకుండా పావు కప్పు గులాజీ వాటర్‌లో కొద్దిగా తేనె కలిపి ముఖానికి మర్దన చేసుకున్నట్లయితే.. ముఖంపై ముడతలు పోయి నాజూగ్గా తయారవుతుంది.