ప్రస్తుత జీవన శైలిలో ప్రతి ఒక్కరు మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారు.
గతంలో వయసు పెరుగుతుంటే జ్ఞాపక శక్తి తగ్గుతూ వచ్చేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు వాళ్లు కూడా జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారు.
అయితే మీరు రోజూ తినే ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలు చేర్చితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..
డ్రై ఫ్రూట్స్: అంజీర, జీడిపప్పు, బాదం, వాల్ నట్స్ వంటి వాటిల్లో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజూ తింటే మెదడు ఆరోగ్యంగా ఉండటంతో పాటు మెమోరీ పవర్ పెరుగుతుంది.
నిమ్మకాయ, ఉసిరి, నారింజ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వీటిని తినడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది.
సోయాబీన్స్, నువ్వులు వంటి తృణధాన్యాల్లో లెసిథిన్ అనే పోషకం ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మెమోరీ పవర్ పెరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
క్యారెట్స్, చిలకడ దుంపలు, బచ్చలికూర, మొలకలు వంటి ఆహార పదార్థాల్లో కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఈ ఫుడ్ ఐటెమ్స్ మీ డైట్‌లో చేర్చుకున్నట్లయితే మెమోరీ పవర్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
చిక్కుళ్లు, గుమ్మడికాయ విత్తనాలు, బార్లీ, ఓట్స్, గోధుమల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. వీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మీ మెమోరీ పవర్ బాగా పెరుగుతుంది.
ఫైనల్‌గా విటమిన్ బి12 అధికంగా ఉండే చేపలు, గుడ్లు, చికెన్, పాలు వంటివి తినడం ద్వారా ఆరోగ్యంతో పాటు.. రోగనిరోధక శక్తిని పెంచడం, మెమోరీ పవర్ ను పెంచడానికి సహాయపడతాయి.