కారులో సేఫ్‌ జర్నీ చేయాలంటే ఈ వాస్తు చిట్కాలు తప్పకుండా పాటించాల్సిందే..!

ఇంట్లోనే కాకుండా ప్రతి విషయంలోనూ వాస్తు పాటించడం అనేది చాలా ముఖ్యం.
ముఖ్యంగా కారు విషయంలో కొన్ని వాస్తు నియమాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ కారు ఉండటం కామన్‌ అయిపోయింది. కార్లు కేవలం స్థాయికి సంబంధించిన అంశమే కాదు, జీవితంలో ముఖ్యమైన భాగమైపోయింది.
సాధారణంగా మనం కారు కొనుగోలు చేసేటప్పుడు దాని రంగు, నంబర్, కంపెనీ లేదా మంచి రోజుతో పాటు మంచి టైమ్ కూడా చూస్తాం.
అయితే కారు కొన్న అనంతరం చాలా మంది వాస్తు గురించి మరచిపోతారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక వస్తువులను కారులో ఉంచాలి. అలాగే కొన్ని వస్తువులను కారులో ఉంచకూడదు.
చాలా మంది కారు కొన్న తర్వాత తమ కారులో దేవుని ఫోటో లేదా విగ్రహం పెడతారు.
కానీ వినాయకుడి విగ్రహం ఉంటే చాలా మంచిదని చెబుతారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం తగ్గుతుంది. అలాగే గణపతి అన్ని అడ్డంకులను అధిగమిస్తాడని నమ్మకం.
మీరు చాలా కార్లపై టిబెటన్ జెండాలను చూస్తారు. ఇది చాలా మంచి శక్తి ప్రవాహాన్ని కలిగిస్తుంది. కారు రన్నింగ్‌లో ఉన్నప్పుడు చుట్టూ సానుకూల శక్తిని సృష్టిస్తాయి.
కారులో ఎప్పుడూ వాటర్ బాటిల్ ఉంచుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. నీటి మూలకం కారులో ఉంటే అది అదృష్టాన్ని పెంచడానికి మేలు చేస్తుంది.
కారులో తాబేలు అండ్ చైనీస్ నాణేలు ఉంచడం ఎంతగానో మంచిదట. ఇది కారు డిజైన్, రంగు. అంతర్గత, బాహ్య సమతుల్యతను కాపాడుతుంది. అలాగే చెడు శక్తులను తొలగిస్తుంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ పగిలిన వస్తువులను కారులో ఉంచవద్దు. కారు కిటికీలు, కార్పెట్, సీటు తరచూ శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇది సమస్యలను కలిగిస్తుంది.