దాంపత్య జీవితంలో గొడవలు రాకుండా ఉండాలంటే.. మగవారు చేయాల్సిన పనులు ఇవే..?

పెళ్లైన కొన్నాళ్లు సంతోషంగా ఉన్న దాంపత్య జీవితంలో ఏదో రకంగా గొడవలు వస్తూనే ఉంటాయి. దీని కారణంగా మనఃశాంతి కరువవుతుంది.
అయితే.. ఇలా గొడవలు రాకుండా ఉండాలంటే మగవారు కొన్ని పనులు చేయాల్సి ఉంది. అవేంటో తెలుసుకుందాం.
చాలా మంది మగవారు పెళ్లైన కొత్తలో భార్యలకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి సంతోష పెడతారు. కాలం గడిచే కొద్ది ఆ అలవాటు మార్చుకుంటారు. దీంతో గొడవలు, మనస్పర్థలు మొదలవుతాయి. కాబట్టి.. ఏదైనా స్పెషల్ డేస్ సందర్భంలో కచ్చితంగా మీ భాగస్వామికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేయండి సంతోషంగా ఉంటారు.
ఏదైనా సందర్భంలో భార్య బాధపడుతున్నట్లయితే భర్త తనకు కచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలి. అలా కాకుండా కొంత మంది సలహాలు ఇస్తారు. బాధలో ఉన్నప్పుడు కావాల్సింది సలహాలు కాదు.. ఓదార్పు. అది మీరు ఇవ్వగలిగితే మీ భార్య మీతో సంతోషంగా ఉంటుంది.
కొంత మంది భర్తలు భార్యలను తనకు నచ్చినట్లుగా మార్చుకోవాలి అనుకుంటారు. అయితే.. మొదట్లో బాగానే ఉన్నా కాలం గడిచే కొద్ది అది వారికి ఇబ్బంది కరంగా మారుతుంది. కాబట్టి మీ పార్టనర్ ప్రపంచాన్ని కూడా ఇష్టపడండి.
చాలా మంది భర్తలు పొదుపు విషయంలో మూర్ఖంగా వ్యవహరిస్తారు. ఆధా చేస్తున్నాం అనుకుని.. భార్య చిన్న చిన్న కోరికలను కూడా పక్కన పెడతారు. అలా చేయడం కారణంగా.. భార్య మనసులో భర్త పట్ల కోపం ఏర్పడి గొడవలకు దారితీస్తాయి. కాబట్టి.. పొదుపు మంచిదే కానీ చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోవాలి.
ఏ దాంపత్య జీవితంలో అయిన సంతోషం అనేది చాలా ముఖ్యం. కాబట్టి వీలైనంత ఎక్కువగా మీ భాగస్వామిని నవ్వించేందుకు ప్రయత్నించండి. ఎంత సంతోషంగా ఉంటే దాంపత్య జీవితానికి అంత మంచిది.
పైన చెప్పినవన్ని భార్యాభర్తలిద్దరికీ వర్తిస్తాయి. దాంపత్య జీవితంలో భాగస్వాములిద్దరు ఒకరి పట్ల మరొకరు ప్రేమగా ఉంటేనే గొడవలు రాకుండా ఉంటాయి.