ఎండాకాలం చాలా మందికి వేడి వల్ల శరీరంపై చెమటకాయలు లేదా, ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి.

అయితే చెమటకాయల వల్ల మంటతో పాటు పలు ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి అలాంటి వారు ఈ టిప్స్ పాటిస్తే ఉపశమనం పొందవచ్చు.
రోజ్ వాటర్‌ను 200ఎంఎల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల తేనె కొన్ని చల్లటి నీళ్లు కలిపి శరీరానికి పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత కడిగితే మంచి ఫలితం ఉంటుంది.
గంధంలో చల్లటి పాలు కలిపి చెమటకాయలు ఉన్న ప్రదేశంలో రాస్తే చెమటకాయలు తగ్గుతాయి.
ముల్తానీ మట్టిలో రెండు టీ స్పూన్ల పుదీనా పేస్ట్, పాలు కలిపి స్కిన్ మీద అప్లై చేయాలి.
అలాగే చల్లటి పెరుగును చెమటకాయలు, మంట ఉన్న చోట రాసుకోవాలి. శరీరంపై పదిహేను నిమిషాలు ఉంచిన తర్వాత కడిగితే మంట నుంచి ఉపశమనం పొందుతారు.
వేసవిలో వడదెబ్బ, చెమటకాయల బారిన పడకూడదంటే ఎక్కువగా కొబ్బరి నీళ్లు, జ్యూస్‌లు తాగడం మంచిది. అంతేకాకుండా ధరించే దుస్తువుల పలు జాగ్రత్తలు పాటించాలి.