కాకిని చూసిన, దాని అరుపు విన్న, మనల్ని కాకి తన్నిన అది జరగబోయే అంశాలకు సూచికలని కొన్ని నమ్మకాలు ఉన్నాయి.
మీరు ఏదైన పని మీద బయటకు వెళ్లి నప్పుడు కాకి అరిచినట్లుయితే.. ఆ పని సక్సెస్ అవుతుందని సంకేతం.
నీళ్లు నిండుగా ఉన్న కుండపై కాకి కూర్చుని ఉండటం ఎవరైతే చూస్తారో వారు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతమట.
ఒకవేళ కాకి తన నోట్లో మాంసం ముక్క, రొట్టె ముక్క ఇలా ఎదైనా పట్టుకుని వెళ్లినప్పుడు చూసినట్లుయితే.. మీరు ఏదో శుభవార్త వినబోతున్నారని, మీకు ఏదో మంచి జరగబోతుందని సంకేతమట.
ఇంటి దగ్గర లేదా, ఆఫీస్ దగ్గర లేదా ఊళ్లో అరిచినట్లయితే ఏదో అశుభ వార్తకు సంకేతం. అలాగే ఆ ప్రాంతానికి చెందిన ఓనర్ సమస్యల్లో పడతారని అర్థమట.
ఒక వ్యక్తి తలపై కాకి వాలితే అవమానాలు జరిగి సమాజంలో గౌరవాన్ని కోల్పొతారని సంకేతమట.
అలాగే కాకి ఓ మహిళ తలపై లేదా ఆమెపై వాలినట్లుయితే ఆమె భర్త సమస్యల్లో పడతాడని అర్థం అట.
నోట్: పైన తెలిపిన సంకెతాలన్ని ఇంటర్నెట్ ఆధారంగా తెలిపినవి మాత్రమే.