వర్షాకాలంలో సెక్స్ వల్ల ఈ సమస్యలు వస్తాయి.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీరు సేఫ్..!

శృంగారానికి నిర్దిష్ట టైమ్, కాలం అంటూ ఏమి ఉండదు. ప్రతి ఒక్కరూ తమ భాగస్వామితో సంతోషంగా గడపాలని కోరుకుంటారు.
ముఖ్యంగా ఈ సీజన్‌లో వర్షంలో తడవడం, సెక్స్‌లో పాల్గొనడానికి చాలా మంది ఇష్టపడుతారు.
అయితే ఈ వర్షాకాలంలో సెక్స్‌ను ఆస్వాదించాలంటే కొన్ని విషయాల్లో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఈ సీజన్‌లో యోని తేమగా ఉంటుంది. దీంతో కూడిన వేడి, తేమ బ్యాక్టీరియా పెరగడానికి అవకాశాలున్నాయట. ఇది దద్దుర్లు, మంట, యూటీఐల ప్రమాదాన్ని పెంచుతుంది.
అయితే శృంగారంలో పాల్గొనే ముందు యోనిని ఖచ్చితంగా శుభ్రపరచుకోవాలి.
ఈ సీజన్‌లో మీ ప్రైవేటు పార్ట్స్ షేవింగ్ తప్పనిసరి. క్వాలీటి గల ఇన్నర్‌ను ధరించాలి.
తరచూ స్పైసీ ఫుడ్ తినకూడదు. స్పైసీ ఫుడ్ తినడం వల్ల యోని పిహెచ్ స్థాయిపై ప్రతికూల ప్రభావం చూపి యోనిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఈ ఇన్ఫెక్షన్ మహిళల నుంచి పురుషులకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ సమస్య మహిళలకే ఎక్కువ కాలం ఉంటుంది.
సెక్స్‌లో పాల్గొన్న తర్వాత తడి వైప్స్‌తో యోనిని క్లీన్ చేసుకోవాలి.
సుగంధ సబ్బులు, బాడీ వాష్‌ల వాడకాన్ని నివారించండి. యోని పరిశుభ్రత మిమ్మల్ని ఎన్నో సమస్యల ప్రమాదం నుంచి కాపాడుతుంది.
పెరుగు, లస్సీ, గ్రీకు పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి యోని పిహెచ్ లెవల్‌ను రక్షిస్తాయి.