పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకూడదు?

చాలా మంది ఆరోగ్యంగా ఉండాలనుకుని రకరకాల పండ్లను ఎంచుకుని తింటుంటారు.
వీటిల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండి శరీరానికి మేలు జరుగుతుందని చిన్నా పెద్ద ఎక్కువగా పండ్లను తింటారు.
అయితే పండ్లను తినేటప్పుడు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
పండ్లను ఇతర ఆహార పదార్థాలతో కలిసి తినకూడదు. ఎందుకంటే మన శరీరంలో టాక్సిన్ విడుదలవడం కారణంగా పలు అనారోగ్య సమస్యలు వస్తాయి.
రాత్రి నిద్రపోయే సమయంలో పండ్లను తింటే జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీంతో నిద్రకు బంగం కలుగుతుంది. ఎసీడిటీ కూడా వచ్చే ప్రమాదం ఉంది.
ఈ పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. నారింజ, పుచ్చకాయ, దోసకాయ, స్ర్టాబెర్రీ వంటి పండ్లను తిని నీరు తాగితే డయేరియా, కలరా వంటి సమస్యలు వస్తాయి.
పండ్ల తినే ముందు వాటి తొక్కలను తీసి తినడం మంచి పద్దతి కాదు. అలా చేస్తే విటమిన్లు,ఫైబర్ వంటివి శరీరానికి అందక అనారోగ్యం బారిన పడతారు.