వర్షాకాలం వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలంటే వీటిని కచ్చితంగా తీసుకోవాల్సిందే?

వర్షాకాలం వానలో తడవడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు ఇబ్బందికి గురిచేస్తుంటాయి. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఈ జ్యూస్‌లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
కీర దోస లో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దీన్ని తాగితే వర్షాకాలం వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
జీర్ణశక్తిని పెంచే సోరకాయ జ్యూస్‌ను తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.
వానాకాలం మార్కెట్‌లో విరివిగా లభ్యమయ్యే కూరగాయల్లో కాకరకాయ ఒకటి. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉండి సీజనల్ జబ్బుల నుండి రక్షిస్తాయి.
రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచడంలో బీట్ రూట్ జ్యూస్ కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని డైట్‌లో చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
చాలా మంది రాడిష్‌ను తినడానికి సంకోచిస్తుంటారు. కానీ, దీని జ్యూస్ వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
అన్ని కూరల్లో ఉపయోగించే టమాటా అందానికి, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. టమాటా జ్యూస్ ఇమ్మూనిటీ పవర్‌ను పెంచడంలో ముందు ఉంటుంది.