శరీరంలో కొవ్వును తగ్గించే కాయగూరలు ఇవే..

మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అధిక బరువు, కొలస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడతారు.
ఇలా అధిక బరువు పెరగడం వల్ల అనారోగ్య సమస్యలు చుట్టు ముట్టి ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది.
అయితే.. కొన్ని రకాల ఆహార పదార్థాలు చెడు కొలెస్ట్రాలను తగ్గించడంతో పాటు రక్తనాళాల్లో రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేసి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. అవేంటో తెలుసుకుందాం..
బీన్స్: బీన్స్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. వీటిలో ఉండే పోషకాలు క్యాన్సర్ కారకాలను నివారించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ప్రతిరోజు బీన్స్ తీసుకోవడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు.
వంకాయ: వంకాయలో పిండి పదార్థాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. వంకాయలో ఉండే పొటాషియం శరీరంలోని హైడ్రైట్లను తొలగించి గుండె సమస్యలను నివారిస్తుంది. అంతే కాకుండా వంకాయ శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలను కరిగిస్తుంది.
సోయా చిక్కుడు: సోయా చిక్కుల్లో పీచు, విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి పోషకాలు ఉంటాయి. అంతే కాకుండా సోయా చిక్కుళ్లలో విటమిన్ B3, B6, విటమిన్-E ఉన్నాయి. ఇవి కాలేయానికి రక్తం నుంచి కొలెస్ట్రాల్ తొలగించే శక్తిని పెంచుతుంది.
ఓట్ మీల్: దీనిలోని కరిగిపోయే బీటా గ్లూకాన్ అనే పీచు పదార్థం చెడు కొలెస్ట్రాల్ నిర్వీర్యం చేస్తుంది. వీటి పొట్టు ప్రేగుల లోనికి కొలెస్ట్రాల్ చేరనివ్వదు. చెడు కొలెస్ట్రాల్ తగ్గించే గుణం సబ్జా గింజలకు ఉంది. పొట్టు తీయని గోధుమలు, మొక్కజొన్న, అవిసె గింజలు తినాలి. ఇవి కొలెస్ట్రాల్ పరిమాణం, రక్తపోటు, రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తాయి.