దీపారధనలో తెలియకుండా చేసే పొరపాట్లు ఇవే!

కొంతమంది నిత్యం ఎంతో భక్తితో దేవుడిని పూజిస్తూ దీపారధన చేస్తుంటారు.
చాలామందికి దీపారాధన ఎలా చేయాలో తెలియక పొరపాట్లు చేస్తారు. దీపం వెలిగించడానికి కొన్ని పద్దతులు ఉంటాయి. అవి ఏంటో తెలుసుకుందాం.
దీపారాధన చేసే ముందే వత్తి వేసిన తర్వాతే నూనే పోస్తారు. కానీ అది సరియైన పద్దతి కాదు. ముందుగా నూనె పోయాలి.
అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు. అగరవత్తితో లేదా ఒక హారతిలో కర్పూరం వెలిగించి దానితో దీపారాధన చేయాలి.
ఒక వత్తి దీపాన్ని చేయరాదు.ఇలా శవం వద్ద వెలిగిస్తారు. కాబట్టి తప్పకుండా రెండు వత్తులు ఉండాలి.
దీపం వెలిగించడానికి శనగనూనె అస్సలు వాడకూడదు. ఆవు నెయ్యి, విప్పనూనె, వేప నూనె, ఆముదం, కొబ్బరి నూనెలు ఉపయోగించాలి.
వెలిగించిన దీపంను కింద పెట్టకుండా తమలపాకు లేదా ప్లేట్ అయినా ఉంచాలి.
దీపారాధన మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షింతలు వేయ్యాలి.
అలాగే దీపం కొండెక్కితే ఓం నమ: శివాయ: అని 108 సార్లు జపించి దీపం వెలిగించాలి.
వీటిని పాటిస్తూ తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయాలి.
సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మి దేవిని స్మరించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు.