వయస్సు పెరుగుతోన్న యంగ్‌గా కనిపించే టాలీవుడ్ సెలబ్రిటీస్ వీళ్లే..!

సాధారణంగా ఎవరికైనా ఏజ్ మీద పడుతోన్న కొద్ది, శరీరంలో మార్పులు వస్తాయి. అయితే కొంతమంది సెలబ్రిటీలు మాత్రం వయస్సుతో సంబంధం లేకుండా యంగ్‌గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు సాధారణంగానే అందగాడు. వయస్తు 47 వయస్సు పెరుగుతున్నా ఈ హీరో లుక్‌లో ఎలాంటి చేంజ్ రావడం లేదు. ఈ యంగ్ లుక్‌లో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
కింగ్ నాగార్జున సైతం వయస్సు పెరుగుతున్నా అదిరిపోయే లుక్‌లో కనిపిస్తున్నాడు. వయస్సు 62 ఏళ్లు అంటే అస్సలు నమ్మలేరు.
ప్రముఖ నటి రమ్యకృష్ణ వయస్సు 52సంవత్సరాలు కాగా.. చూడటానికి ఆమె అలా అస్సలు కనిపించరనే సంగతి తెలిసిందే.
ప్రముఖ నటుడు బ్రహ్మాజీ 57 ఏళ్లు ఉన్నా యంగ్‌గా కనిపిస్తాడు.
మాస్ మహారాజ్ రవితేజ 55 సంవత్సరాలు అయినా కూడా ఆయన యంగ్ లుక్‌లో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు.
సీనియర్ హీరోయిన్లు.. నదియా, మీనా, టబు కూడా వయస్సుతో పోల్చి చూస్తే తక్కువ ఏజ్ ఉన్న వాళ్లలానే కనిపిస్తున్నారు.
శ్రియ, త్రిష, శృతి హాసన్, మలైకా అరోరా కూడా చాలా తక్కువ వయస్సు ఉన్న సెలబ్రిటీలలా కనిపిస్తున్నారనే సంగతి తెలిసిందే.
యాంకర్ సుమ అసలు వయస్సు చెబితే ఎవరూ నమ్మరు. అనసూయ, రష్మీ కూడా చిన్న వయస్సు వారిలా ఉంటారు.
ఈ సెలబ్రిటీలలో కొంతమంది ప్రత్యేకమైన డైట్ మెయింటెన్ చేయడం వల్ల తక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల్లా కనిపిస్తున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీలకు మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.