మండుతున్న ఎండల నుంచి మీ శరీరాన్ని కాపాడుకునే టిప్స్ ఇవే..

ఈ సంవత్సరం ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచే భానుడి భగభగలకు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
అయితే ఎండ నుండి మీ శరీరాన్ని రక్షించుకోవాలంటే ఈ టిప్స్ పాటించడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వేసవిలో ఎక్కువగా శీతల పానీయాలను తాగాలి. లేదా నీటిని తరచూ తాగుతూ ఉండటం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.
టైట్‌గా ఉండే దుస్తువులను ధరించకపోవడమే మంచిది. లేదంటే చర్మానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
బయటకు వెళ్లేటప్పుడు సన్ గ్లాసెస్, లేదా టోపీలు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎండల నుంచి బాడీని కాపాడుకోవచ్చు.
అలాగే వేసవిలో స్పైసీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. వాటికి బదులుగా నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలను తినాలి.
ఎండలకు అందం చెడిపోకుండా ఉండాలంటే అలోవెరా జెల్‌ను ఫేస్‌ ఫ్యాక్ వేసుకుంటే ముఖం మిలమిల మెరవడం ఖాయమట.