రామాయణంలో రాముడి పాత్ర ఎంత ఉందో, నిశ్శబ్ద కథానాయిక సీత పాత్ర కూడా అంతే ఉంది.

సీత నుంచి నేటి యువతులు చాలా విషయాలు నేర్చుకోవాలి అంటారు పెద్దలు
ముఖ్యంగా స్త్రీ నుంచి ప్రతి యువతి 5 జీవిత పాఠాలు నేర్చుకోవాలంట. అవి :
సీతాదేవి తన చిన్నప్పటి నుంచి ప్రశ్నలు అడిగేదంట. అలాగే ప్రతి అమ్మాయి కూడా ప్రశ్నలు అడగాలి మనసులో ఉంచుకోకూడదంట.
సీతా దేవి ఎప్పుడూ కష్టాలకు భయపడలేదంట, అలాగే ఇప్పటి యువతులు కూడా కష్టాలకు భయపడకూడదంట
భారతీయ పురాణాల్లో ఒంటరి తల్లుల్లో మొదటి తల్లి సీతాదేవి.. క్లిష్టపరిస్థితుల్లో ఒంటరిగా నడవాలి.
రావణాసురుడు ఎత్తుకెళ్లిన కష్ట సమయంలో తనేంటో నిరూపించుకుంది. నిజంగానే సీతమ్మతల్లి పోరాటయోధురాలు అందుకే నేటి కాలం ఆడపిల్లలకు ఆమె ఆదర్శప్రాయం.
సీత తన పరువు కోసం పోరాడి, భర్తతో వెళ్లకుండా భూ తల్లితో కలిసిపోయింది. శక్తివంతమైన మహిళలకు ఇదే సరైన మార్గమని ఆమె భావించింది. ఈ విషయాన్ని అమ్మాయిలందరూ గ్రహించాలి.