ఫోన్ హ్యాక్ అయిందని తెలుసుకునే సింపుల్ టిప్స్ ఇవే..!

ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో చాలా మంది ఫోన్‌కు అడిక్ట్ అయిపోయారు. దీంతో చాటింగ్, గేమింగ్, వంటివి చేస్తున్నారు. కొంత మందికి ఫోన్ హ్యాక్ చేసే అవకాశాలు పెరిగిపోతున్నాయి.
ఇటీవల కాలంలో చాలా మంది ఫోన్ హ్యాక్ చేసి పర్సనల్ డేటా దొంగిలించి డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.
ఫోన్ హ్యాక్ అయిందా, లేదా అని తెలుసుకునే సింపుల్ చిట్కాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
మొబైల్ ఉపయోగించక పోయినా బ్యాటరీ తగ్గడం వంటివి జరుగుతుంటాయి.
ఒక్కోసారి ఫోన్ వాడుతుంటే దానంతట అదే రీస్టార్ట్ అవుతూ ఉంటుంది. అలా జరిగితే మీ ఫోన్ హ్యాక్ అయినట్టు గుర్తించాలి.
అలాగే కొన్నిసార్లు మనం వాడని యాప్స్ కూడా డౌన్‌లోడ్ అవుతుంటాయి. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఏదైనా వీడియో లేదా ఫొటో చూసేటప్పుడు సడెన్‌గా క్లోజ్ అయిపోతాయి. ఇలాంటి మార్పులు కనిపించినప్పుడు నెట్ ఆఫ్ చేసి హ్యాకింగ్ గురించి తెలిసిన వారిని సంప్రదించి కన్ఫామ్ చేసుకోవాలి.