పురాతన కాలంలో వివాహం అంటే జన్మజన్మల అనుబంధంగా భావించేవారు
ప్రస్తుతం పెళ్లి అంటే మున్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. చాలా మంది దంపతులు చిన్న కారణాలకే పచ్చని కాపురాలు కూల్చుకుంటున్నారు
భార్యభర్తలకు ఒకరిపై మరొకరికి నమ్మకం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మిమ్మల్ని మీ భాగస్వామి మోసం చేస్తున్నారని చెప్పే సంకేతాలు ఇక్కడ తెలుసుకుందాం
సాధారణంగా ఉన్న అలవాట్లలో ఆకస్మికంగా మార్పులు వచ్చినప్పుడు వారి హృదయం ఇతరుల మీదకు మారుతున్నట్లు అర్థమట.
మీ పార్ట్నర్ ఇంట్లో ఉండి మీతో సమయం గడపడానికి ఇష్టపడకపోతే వారు ఇతరులతో జీవితాన్ని కోరుకుంటున్నారని భావించాలి. మీరు ఎలా ఉంటే వారికి ఇష్టమో అలా ఉండడానికి ప్రయత్నించాలి.
మీ భాగస్వామి మిమ్మల్ని తన సోషల్ మీడియా ఖాతాలను చూడనివ్వకుండా రహస్యంగా ఉంచితే ఏదో విషయాన్ని దాస్తూ మిమ్మల్ని మోసం చేస్తున్నారన్నట్టు.
అలాగే తరచూ అబద్దాలు చెప్పడం మీ ఇద్దరి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను పంచుకోకపోతే మీరు జాగ్రత్తగా ఉండాలి.
ఒకవేళ మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారని కన్ఫామ్ అయితే వారంటే మీకు ఎంత ఇష్టమో తెలియజేస్తే వారిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుందట.