మన శరీరానికి ఆహారం ఎలాగైతే అవసరమో, అంతే నీరు కూడా అంతే అవసరం

అయితే చాలా మంది సమ్మర్ వచ్చేసిందని, అవసరానికి మించి అతిగా నీరు తాగుతుంటారు.
ఇలా ఎక్కువగా నీరు తాగడం కూడా మంచిది కాదంట, దీనిపై ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.
వారు అతిగా నీరు తాగే కొంత మందిపై పరీక్షలు చేయగా వారి అధికంగా తాగిన వ్య‌క్తుల మెద‌డులో ఉండే ఫ్రీ ఫ్రంట‌ల్ ప్రాంతాలు చాలా చురుగ్గా ఉన్నాయ‌ని నిర్దారించారు.
దీని వలన వారు ఏదైనా తినాల‌న్నా, న‌మ‌లాల‌న్నా చాలా ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంద‌ని క‌నుక్కున్నారు.
అందువలన దాహం ఎంతవేస్తే అంతే నీరు తాగాలి కానీ అతిగా నీరు తాగకూడదని వారు హెచ్చరిస్తున్నారు.
సమ్మరే కదా అని అతిగా నీరు తాగితే,హైపోనెట్రేమియా అనే స‌మ‌స్య వ‌స్తుంద‌ని.
దీని వలన కణాల వాపు రావడం, కల్లు తిరిగిపడివడం జరుగుతుంది అంటున్నారు.